- జంట నగరాల లోక్ సభ సెగ్మెంట్ల పోలింగ్ శాతం పెంచేందుకు అవేర్ నెస్ చేసిన అధికారులు
- గతంలో హైదరాబాద్‌లో అత్యల్పంగా 43, అత్యధికంగా 77.1 శాతం నమోదు
- సికింద్రాబాద్ లో అత్యల్పంగా 41.9 , అత్యధికంగా 59.9 శాతం నమోదు
- ఈసారి గతం కంటే ఎక్కువగా నమోదు కావొచ్చని అంటున్న అధికారులు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీ పరిధిలోని లోక్ సభసెగ్మెంట్లలో ఏ ఎన్నిక జరిగినా పోలింగ్ శాతం తగ్గుతూ వస్తోంది. గత లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ సెగ్మెంట్లో సగం శాతం కూడా పోలింగ్‌నమోదు కాలేదు. ఈసారి వరుస సెలవులు రావడం, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, అర్బన్ ఏరియాల్లోని ప్రజలు ఓటు వేసేందుకు విముఖత చూపుతుండడం వంటి కారణాలతో ఓటింగ్ శాతం మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆయా పార్టీల అభ్యర్థులు కూడా ప్రచారం అనుకున్న స్థాయిలో నిర్వహించలేదు. ఎన్నికల కమిషన్, జీహెచ్ఎంసీ ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు అతికించడం, ఓటర్ స్లిప్పులను పంపిణీ చేయడం, అపార్టుమెంట్స్, ఐటీ కారిడార్స్, కాలేజీల్లో సదస్సులు నిర్వహించి ఓటు హక్కు ప్రాధాన్యంపై అవేర్ నెస్ కల్పించాయి. ఈసారైనా గతం కంటే ఎక్కువగా నమోదు కావొచ్చని అధికారులు పేర్కొన్నారు.
పోలింగ్ శాతం ఎక్కువ, తక్కువ నమోదు
1952లో ఏర్పాటైన హైదరాబాద్లోక్ సభ సెగ్మెంట్లో అధిక ఓటింగ్‌శాతం 1991లో 77.1గా నమోదైంది. ఇదే ఇప్పటికి రికార్డుగా ఉంది. 1952 లో జరిగిన తొలి ఎన్నికలో హైదరాబాద్ లో అత్యల్పంగా 43 శాతం నమోదైంది. 1998 లో అధికంగా నమోదై.. అనంతరం ఓటింగ్‌శాతం తగ్గుతూ వస్తోంది. 2019లో 45.8 శాతంగా నమోదైంది.1984 లో సికింద్రాబాద్సెగ్మెంట్లో 59.9 శాతం పోలింగ్ జరిగింది.
ఇదే నేటికి అధిక శాతంగా ఉంది. 1952 లో తొలి సార్వత్రిక ఎన్నికల్లో అత్యల్పంగా శాతం 41.9 శాతం నమోదైంది. 2019లో 48.9 శాతం నమోదైంది. 2009లో ఏర్పాటైన చేవెళ్ల సెగ్మెంట్లో అధికంగా 64.5 శాతం నమోదైంది. 2009లో ఏర్పాటైన మల్కాజిగిరి సెగ్మెంట్లో 2019లో 53.4 శాతం అధికంగా నమోదైంది.