దేవర (Devara) తుఫాన్ ఎలా ఉందో ప్రపంచవ్యాప్తంగా మొదలైన సెలబ్రేషన్స్ బట్టే అర్ధమైతుంది. ఈ మూవీ రేపు సెప్టెంబర్ 27 శుక్రవారం రీలిజ్ కానుండగా.. సోమవారం (సెప్టెంబర్ 23) నుంచే టికెట్ల అమ్మకాలు మొదలయ్యాయి. ఇపుడు సోషల్ మీడియాలో, థియేటర్లో, ఓవర్సీస్ లో..ఇలా ప్రపంచమంతా దేవర ఫీవర్ పట్టుకుంది. ఇన్ని రోజులు దేవర మేకర్స్ ప్రమోషన్స్ చేశారు..ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర అడ్వాన్స్ బుకింగ్స్ తోని, ఎన్టీఆర్ కటౌట్స్ తోని, మాస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.
అయితే, ఈ మూవీ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఇంత హైప్ తెచ్చుకున్న దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా ఓ సారి చూద్దాం.
దేవర ప్రీరిలీజ్ బిజినెస్::
ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్టు తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడంతో దేవరపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానేదేవర ప్రీరిలీజ్ బిజినెస్ చాలా భారీగానే జరిగింది. నైజాం ఏరియాలో 'దేవర' రూ.45 కోట్లకు అమ్ముడు పోయిందని సమాచారం అందుతోంది. గతంలో ఎన్టీఆర్ నటించిన పలు చిత్రాలు నైజాం ఏరియాలో భారీగానే కలెక్షన్లను అందుకున్నాయి.
అయితే, తెలంగాణ ఏరియాలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే అద్భుతమే జరగాలి. ఎందుకంటే ఇప్పటి వరకూ ఆర్ఆర్ఆర్ తప్ప జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఏ మూవీ ఆ మార్క్ అందుకోలేదు. కనీసం రూ.53 కోట్లు అయినా వసూలు చేయాలని తాజాగా ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది.
Also Read :- ఎన్జీఆర్ భార్యగా.. ఎవరీ శ్రుతి మరాఠే?
అంతేకాకుండా నైజాం ఏరియాలో కనీసం రూ.45 కోట్లు వస్తేగానీ బ్రేక్ ఈవెన్ చేరుకునే అవకాశం లేదని ఓ ట్రేడ్ ఎక్స్‌పర్ట్ వెల్లడించినట్టు సమాచారం. అలాగే, ఈ సారి నైజాంలో రూ.50 కోట్ల షేర్ వస్తుందని అనుకుంటున్నారట. సీడెడ్‌లో రూ.22 కోట్ల బిజినెస్ చేసిందని టాక్ వినిపిస్తోంది. పైగా సీడెడ్ నందమూరి ఫ్యాన్స్‌కు అడ్డ! కాబట్టి ఇక్కడ రూ.25 కోట్ల షేర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
అయితే, గతంలో ఆర్ఆర్ఆర్ మూవీ మాత్రమే తెలంగాణ ప్రాంతంలో రూ.50 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. మరి దేవరకి ఉన్న ఈ భారీ హైప్తో ఆ మార్క్ చేరుకుంటుందా ? లేదా అనే సస్పెన్స్ మొదలైంది.
ఇకపోతే.. అన్ని ఏరియాలలో. పలు రాష్ట్రాల్లో బిజినెస్ లెక్కలు చూసుకుంటే.. వైజాగ్‌లో రూ.12.5 కోట్లు,ఈస్ట్ రూ.8 కోట్లు, వెస్ట్ రూ.6 కోట్లు, కృష్ణా రూ. 7 కోట్లు, గుంటూరు రూ. 8.5 కోట్లు, నెల్లూరు రూ. 4 కోట్లు అని టాక్ నడుస్తోంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.115 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
దేవర బాక్సాఫీస్ టార్గెట్::
ఎన్టీఆర్ కు కర్ణాటకలోనూ భారీగా ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవర మూవీని అక్కడ భారీగా రిలీజ్ చేస్తున్నారు. అయితే. ఈ మూవీ అక్కడ రూ.15 కోట్లకు అమ్ముడుపోయిందట. తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ.50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట.
ఇకపోతే ఓవర్సీస్ లోను లెక్కలు భారీగానే ఉన్నాయి. యూఎస్‌లో రూ.26 కోట్లు, హిందీ బెల్ట్‌లో రూ.15 కోట్లు అని సమాచారం. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ.185 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అంటే ఈ లెక్కన రూ.200 కోట్ల షేర్ వసూళ్లు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.
తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాలలో ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా రూ. 180 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ టాప్ 9 హైయెస్ట్ బిజినెస్ తెలుగు మూవీగా ఉంది. RRR మూవీ 480+ కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. ‘కల్కి 2898ఏడీ' రెండో స్థానంలో నిలిచింది.కాగా దేవర రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.