MI vs KKR: కోల్‌కతాతో ముంబై కీలక మ్యాచ్.. ఓడితే ప్లే ఆఫ్ నుంచి ఔట్

MI vs KKR: కోల్‌కతాతో ముంబై కీలక మ్యాచ్.. ఓడితే ప్లే ఆఫ్ నుంచి ఔట్

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ను వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ ల్లో మూడే విజయాలు సాధించి ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపుగా కోల్పోయింది. అయితే ఏదో మూల ముంబై ఆశలు మిగిలే ఉన్నాయి. మిగిలిన 4 మ్యాచ్ ల్లో గెలవడంతో పాటు.. ఇతర జట్ల ఫలితాలు ముంబైకు అనుకూలంగా వస్తే ప్లే ఆఫ్ కు అర్హత సాధించిన ఆశ్చర్యం లేదు. ఈ నేపథ్యంలో నేడు (మే 3) కోల్‌కతా నైట్ రైడర్స్ తో కీలక మ్యాచ్ లో తలపడుతుంది.

టోర్నీలో నిలవాలంటే ముంబై ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా విజయం సాధించాలి. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఓడితే టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమిస్తుంది. ముంబైలోని వాంఖడే ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. సొంతగడ్డపై నెగ్గడానికి ముంబైకు ఇది చక్కని అవకాశం. పాయింట్ల పట్టికలో టాప్ 3 లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ (16), కోల్ కతా నైట్ రైడర్స్ (12),లక్నో సూపర్ జయింట్స్ (12) మిగిలిన అన్ని మ్యాచ్ ల్లో గెలవడంతో పాటు ముంబై తమ తదుపరి నాలుగు మ్యాచ్ ల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి.

అప్పుడు మిగిలిన ఒక్క ప్లే ఆఫ్ స్థానం కోసం 7 జట్లు పోటీ పడతాయి. ముంబై తో పాటు ప్రతి జట్టుకు ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశం ఉంది. కనీసం 7 మ్యాచ్ ల్లో గెలిస్తే ఏదో మూల ఆశలు సజీవంగానే ఉంటాయి. మరోవైపు కేకేఆర్ టోర్నీలో టాప్ ఫామ్ లో ఉంది. ఆడిన 9 మ్యాచ్ ల్లో 6 విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతుంది. బలాబలాలు చూసుకుంటే కేకేఆర్ పటిష్టంగా కనిపిస్తుంది. మరి ముంబై మ్యాజిక్ చేసి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంటుందో లేదో చూడాలి.