సియోల్: దక్షిణ కొరియాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. గత నెల రోజులుగా అక్కడ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఒక్కరోజే రికార్డు స్థాయిలో 6 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. సౌత్ కొరియాలోకి మహమ్మారి ప్రవేశించిన నాటి నుంచి ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి అని కొరియా వ్యాధి నియంత్రణ, నివారణ సంస్థ (కేడీసీఏ) వెల్లడించింది. దేశంలో 6.21 లక్షల పైచిలుకు కరోనా కేసులు నమోదయ్యాయని.. గురువారం ఒక్కరోజే వైరస్ బారిన పడి 429 మంది మృతి చెందారని కేడీసీఏ తెలిపింది. ముందురోజుతో పోలిస్తే దాదాపు రెట్టింపు మరణాలు నమోదైనట్లు చెప్పింది. కొరియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.25 లక్షలకు చేరుకుందని పేర్కొంది. ఈ వేవ్ పీక్ కు చేరితే 4 లక్షలకు కేసులు చేరొచ్చని ప్రభుత్వం అంచనా వేసిందని.. కానీ అప్పుడే ఆరు లక్షల పైచిలుకు కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోందని వివరించింది.
South Korea reports record Covid deaths as daily cases surge past 600,000 https://t.co/D1SymzIVIA
— The Guardian (@guardian) March 17, 2022
మరిన్ని వార్తల కోసం: