
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ మధ్య ఓవల్ ఆఫీసులో జరిగిన వాడివేడి భేటీపై రష్యా స్పందించింది. భేటీలో జెలెన్ స్కీ అన్నీ అబద్ధాలే చెప్పారని, ట్రంప్‌తో వాదించారని మండిపడింది.
తనను విసుగెత్తించేలా మాట్లాడినా.. జెలెన్ స్కీని ట్రంప్ కొట్టలేదని, అమెరికా ప్రెసిడెంట్ హుందాగా వ్యవహరించారని రష్యా విదేశాంగ శాఖ మహిళా ప్రతినిధి మరియా జఖరోవా అన్నారు. ఈ మేరకు ఆమె టెలిగ్రాంలో పోస్టు చేశారు. ‘‘జెలెన్స్కీ ఒక అబద్ధాలకోరు.
ఎక్కడికివెళ్లినా వాదనలు పెట్టుకుంటాడు. ఆయన రెచ్చగొడుతున్నా.. ట్రంప్ సంయమనం కోల్పోలేదు. ఉపాధ్యక్షుడు వాన్స్ కూడా ఆవేశపడలే. వారు జెలెన్ స్కీని కొట్టకపోవడం ఆశ్చర్యకరమే” అని జఖరోవా పేర్కొన్నారు.