ఇటీవల కాలంలో టెలికం కంపెనీలు తమ కస్టమర్లకోసం 5G eSIM లను అందించడం ప్రారంభించాయి. eSIM లు ఇప్పుడు వాడుతున్న ఫిజికల్ SIM లకంటే ఉత్తమమైనవి. ఎందుకంటే ఎవరైనా మీ ఫిజికల్ సిమ్ ను దొంగిలించినప్పుడు దానిని క్లోన్ చేసి మీ డిటెయిల్స్ దొంగిలించే అవకాశం ఉంది. కానీ eSIM లను అలా మీ ఫోన్ల నుంచి అంత ఈజీగా తీసువేసే అవకాశం లేదు. దీంతోపాటు eSIM లో ప్రత్యేకత ఏంటంటే.. ఒక నెట్ వర్క్ నుంచి ఇంకో నెట్ వర్క్ కి మారడం చాలా ఈజీ.
ఇటీవల వోడాఫోన్ ఐడియా కూడా ముంబై తర్వాత ఢిల్లీలో కూడా eSIM ఫ్యాసిలిటీ అందిస్తున్నట్లు ప్రకటించింది. మరో రెండు టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్ టెల్ కూడా ఇప్పటికే eSIM ఫ్యాసిలిటీని అందిస్తున్నాయి. మీరు eSIM ను మీ స్మార్ట్ ఫోన్లలో వినియోగించాలనకుంటే.. జియో, ఎయిర్ టెల్ 5G eSIM లను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో గైడ్ లైన్స్.
ఎయిర్ టెల్ 5G eSIM యాక్టివేట్ గైడ్ లైన్స్ :
- మొదట మీ స్మార్ట్ ఫోన్ లో మేసేజ్ యాప్ ని ఓపెన్ చేయాలి
- ఎయిర్ టెల్ నంబరు నుంచి eSIM your email address అంటే (e.g.., eSIM techlusive@gmail.com) మాదిరిగా 121 కు మేసేజ్ చేయాలి.
- ఒకసారి SMS పంపిన తర్వాత రిప్లై వస్తుంది 1 ని టైప్ చేసి పంపాలి.
- కాల్ ద్వారా మాట్లాడటానికి 121 నుంచి ముందుగా ఓ మేసేజ్ వస్తుంది.
- కాల్ తర్వాత మీ ఈమెయిల్ కు QR కోడ్ వస్తుంది..
- తర్వాత Settings >Mobile Date> Add data plan
- eSIM ను ప్రైమరీ, లేదా సెకండరీ సిమ్ గా యాక్టివేట్ చేసుకునేందుకు ఆప్షన్లు ఉంటాయి.. వాటిలో ఏదీ కావాల్లో ఎంచుకొని టాప్ చేయాలి
Jio eSIM యాక్టివేషన్ కు గైడ్ లైన్స్ :
- మొదట మీ స్మార్ట్ ఫోన్ లో మేసేజ్ యాప్ ను ఓపెన్ చేయాలి.
- మీ జియో ఫోన్ నంబర్ నుంచి eSIM your email address అంటే (e.g.., eSIM techlusive@gmail.com) మాదిరిగా 199కు మేసేజ్ పంపించాలి
- మేసేజ్ కు రిప్లై వస్తుంది.. ’1‘ తో రెస్పాన్స్ ఇవ్వాలి
- మీతో జియో ప్రతినిధులు మాట్లాడేందుకు 199 నుంచి మరో మేసేజ్ వస్తుంది..
- కాల్ మాట్లాడిన తర్వాత మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ కు QR కోడ్ వస్తుంది.
- Settings ను ఓపెన్ చేసి mobile data> add data plan సెలక్ట్ చేసుకోవాలి
- మీ eSIM ను ప్రైమరీ సిమ్ గా వాడతారా..సెకండరీ సిమ్గా వాడతారా..సెలెక్ట్ చేసుకోవాలి.
- ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే వెళితే మీ స్మార్ట్ ఫోన్ లో జియో, ఎయిర్ టెల్ సిమ్ 5G eSIM ను యాక్టివేట్ చేసుకోవచ్చు.