
విదేశాల్లో రూపే (డెమోస్టిక్ కార్డ్ స్కీమ్, మొబైల్ ద్వారా UPI చెల్లింపుల కోసం ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL) ను NCPI బోర్డు ప్రారంభించింది. దీని ద్వారా యూపిఐ, రూపే కార్డు ద్వారా విదేశాల్లో కూడా చెల్లింపులు చేయొచ్చు. ఏదైనా దేశానికి వెళ్లినపుడు యూపిఐ, రూపే కార్డు ద్వారా చెల్లింపులు చేసేందుకు NIPL నెట్ వర్క్ ద్వారా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. ప్రస్తుతం భూటాన్, మారిషస్, సింగపూర్, శ్రీలంక, యూఏఈ, ఫ్రాన్స్ తో సహా ఆరు దేశాల్లో UPI , Rupay కార్డుల ద్వారా చెల్లింపులు అందుబాటులో ఉన్నాయి.
దీనికోసం UPI యాప్ లలో UPI ఇంటర్నేషనల్ ని యాక్టివేట్ చేసుకోవాలి. ఇక్కడ Phonepe , Google Pay, BHIM లో UPI ఇంటర్నేషనల్ ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకుందాం..
Phone Pe లో :
- Phonepe యాప్ ని ఓపెన్ చేయాలి
- యాప్ లో పైన ఎడమ వైపు మూలలో ఉన్న మీ ప్రొఫైల్ చిత్రం పై క్లిక్ చేయాలి
- చెల్లింపుల(Payment ) సెట్టింగ్ ఉంటుంది.దానిపై క్లిక్ చేయాలి
- చెల్లింపుల(Payment ) లో యూపిఐ ఇంటర్నేషనల్ ఉంటుంది. క్లిక్ చేయాలి
- అంతర్జాతీయ చెల్లింపుల కోసం బ్యాంక్ అకౌంట్ పక్కన ఉన్న యాక్టివేట్ క్లిక్ చేయాలి
- యాక్టివేషన్ ని నిర్దారించేందుకు UPI ని ఎంటర్ చేయాలి
Google Pay (GPay)
- Google Pay యాప్ ని ఓపెన్ చేయాలి
- Scan QR Code పై క్లిక్ చేయాలి
- ఇంటర్నేషనల్ మర్చంట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి
- ఫారిన్ కరెన్సీలో మీరు చెల్లించాల్సిన అమౌంట్ ను ఎంటర్ చేయాలి
- బ్యాంక్ అకౌంట్ సెలక్ట్ చేసుకొని పేమెంట్స్ చేయాలి
- పేమెంట్ చేసేటప్పుడు మీరు బ్యాంకు ఖాతా యూపీఐ ఇంటర్నేషనల్ ఖాతాకు సపోర్ట్ చేస్తున్నట్టయితే ‘‘యాక్టివేట్ యూపీఐ ఇంటర్నేషనల్ ’’ ఆప్షన్ కనిపిస్తుంది.
- ‘యాక్టివేట్ యూపీఐ ఇంటర్నేషనల్ క్లిక్ చేసి UPI పిన్ ను ఎంటర్ చేసినట్లయితే పేమెంట్ అయిపోతుంది.
BHIM లో
- మొదట BHIM యాప్ ను ఓపెన్ చేయాలి
- ఫ్రొఫైల్ సెక్షన్ లోకి వెళ్లాలి
- My Linked Bank Accounts క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ ను సెలక్ట్ చేసుకోవాలి
- తర్వాత UPI Global పై క్లిక్ చేయాలి
- వాలిడిటీ పీరియడ్ ను ఎంచుకోవాలి
- యాక్టివేషన్ నిర్ధారణకు UPI PIN ని ఎంటర్ చేయాలి