
తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ఖతార్‌లోని దోహాలోని ఆలివ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. మదర్ టీచర్, సోషల్ స్టడీస్, ఆర్ట్, ఎకనామిక్స్, డ్యాన్స్ విభాగాల్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థి 25 మరియు 45 సంవత్సరాల వయస్సులో ఉండాలి. B.Ed (రెగ్యులర్) , CBSE పాఠశాలలో 2-3 సంవత్సరాల అనుభవంతో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.
ALSO READ:డివైడర్ పైకి ఎక్కిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు
ఎంపికైన అభ్యర్థులకు రూ. 79,000 నుండి రూ. 1.2 లక్షల వరకు జీతంతో వసతి, రవాణా, వైద్య మరియు బీమా అందించబడుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు TOMCOMను 83286-02231 లేదా 78935-66493లో సంప్రదించాలని తెలిపారు. అభ్యర్థులు వారి రెజ్యూమ్‌ని tomcom.itcoordinator@gmail.com కు పంపాలి.