గూగుల్ మీకు తెలియకుండానే మీరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు అనే డేటాను ట్రాక్ చేస్తుందని తెలుసా? గూగుల్ ఒక్కటే కాదు ఫోన్‌లో ఉండే కొన్ని యాప్స్ కూడా మనకు తెలియకుండా లొకేషన్ ట్రాక్ చేసి సేవ్ చేసుకుంటుంటాయి. యూజర్లు ఎక్కడికెళ్తున్నారు అనే వివరాలను పర్సనలైజ్ చేసి యాడ్ కంపెనీలకు ఇస్తుంటాయి. యాడ్ కంపెనీలు మీ లైఫ్‌స్టైల్ అర్థం చేసుకుని దానికి తగ్గ యాడ్స్‌ను మొబైల్‌లో డిస్ ప్లే అయ్యేలా చేస్తాయి. ఇది తెర వెనుక జరిగే కథ. అయితే ఈ ట్రాకింగ్ నుంచి తప్పించుకోవడం కష్టమేమీ కాదు. ఫోన్‌లో కొన్ని సెట్టింగ్స్ మార్చుకుంటే చాలు.
అవసరం లేకున్నా లొకేషన్ డేటాను ట్రాక్ చేయడం వల్ల యూజర్ల ప్రైవసీ దెబ్బతింటుంది. దీన్నుంచి తప్పించుకోవాలంటే యాప్స్‌కు లొకేషన్ పర్మిషన్ ఆఫ్ చేయాలి . ముందుగా ఫోన్ ‘సెట్టింగ్స్’లోకి వెళ్లి అక్కడ ‘యాప్స్ అండ్ నోటిఫికేషన్స్’పై క్లిక్ చేయాలి. తర్వాత ‘యాప్ పర్మిషన్స్’లోకి వెళ్లి ‘లొకేషన్’ సెక్షన్ ఓపెన్ చేస్తే ‘లొకేషన్ ట్రాకింగ్’ అనుమతి ఉన్న యాప్స్ లిస్ట్ చూపిస్తుంది. అక్కడ ‘ఎలో ఆల్ ది టైమ్ , ఎలో ఓన్లీ వైల్ ఇన్ యూజ్’ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఫుడ్ డెలివరీ, రైడింగ్ యాప్స్, గూగుల్ మ్యాప్స్ వంటి వాటికి లొకేషన్ ‘ఎలో ఓన్లీ వైల్ ఇన్ యూజ్’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసి మిగతా వాటికి లొకేషన్ ఆఫ్ చేయాలి. ఇలా చేస్తే యాప్స్ లొకేషన్ ట్రాక్ చేయలేవు.
యాప్స్‌తో పాటు గూగుల్ కూడా మీ లొకేషన్‌ను ట్రాక్
చేయకూడదు అనుకుంటే.. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి పైన ఉండే ప్రొఫైల్ ఫొటోపై క్లిక్ చేయాలి. అక్కడ ‘యువర్ డేటా ఇన్ మ్యాప్స్’ పై క్లిక్ చేసి ‘లొకేషన్ హిస్టరీ’ ఇంకా ‘వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ’ని ఆఫ్ లేదా పాజ్ చేయొచ్చు. ఇలా చేస్తే మ్యాప్స్.. లొకేషన్‌ను ట్రాక్ చేయలేదు.