నిర్మాణంలో ఉన్న ఇండ్లను ఎలా రద్దు చేస్తరు ?

ఆత్మకూరు, వెలుగు : ‘గృహలక్ష్మి’ ఇండ్లను నిర్మించిన ఏకైక నియోజకవర్గం పరకాల అని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చెప్పారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరులో బుధవారం మీడియాతో మాట్లాడారు. నిర్మాణ దశలో ఉన్న ఇండ్లను ఎలా రద్దు చేస్తారని, లబ్ధిదారులకు ఇండ్లు ఇచ్చే దాకా పోరాటం చేస్తామని హెచ్చరించారు. గృహలక్ష్మి పథకంలో ఎంపిక చేసిన లబ్ధిదారులను అభయ హస్తం స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఇందిరమ్మ ఇండ్ల లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేర్చాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.

పార్టీలకతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేసి మంజూరు పత్రాలు అందజేసినట్లు గుర్తు చేశారు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయకులు బొల్లోజు కుమారస్వామి, కాంతాల కేశవరెడ్డి, రేవూరి సుధాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, పాపని రవీందర్, రేవూరి ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.