
శ్రీ రాముని భక్తుడైన హనుమంతుడిని పూజిస్తూ హనుమాన్ జయంతి వేడుకలను జరుపుకుంటారు.ఈ ఏడాది(2025)ఏప్రిల్ 12 వ తేదీ శనివారం హనుమాన్ జయంతిని ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడానికి భక్తులు రెడీ అవుతున్నారు. అయితే ఈ ఏడాది జరుపుకొనే హనుమాన్ జయంతి ఎంతో ప్రత్యేకమైనది.
హనుమాన్ జయంతి రోజున 57 సంవత్సరాల ఐదు గ్రహాలు మీన రాశిలో కలవడం వలన పంచగ్రహ కూటమి (సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని , రాహువు) ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.హనుమాన్జయంతి రోజు పంచగ్రహి కూటమి ఏర్పడటంతో హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అందరూ హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు.. ఏఏ రాశుల వారు ఏ మంత్రాన్ని పఠించాలో తెలుసుకుందాం. . .
పంచాంగం ప్రకారం చైత్ర పౌర్ణమి తిథి ఏప్రిల్ 12న తెల్లవారుజామున 3:20 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో, ఏప్రిల్ 13న ఉదయం 5:52 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి జరుపుకుంటారు.
- మేషరాశి : ఓం సర్వదుఃఖరాయ నమః
- వృషభ రాశి : ఓం కపిసేనానాయక నమః
- మిథున రాశి : ఓం మనోజ్వాయ నమః
- కర్కాటక రాశి: ఓం లక్ష్మణప్రాండత్రే నమః:
- సింహ రాశి : ఓం పర్శౌర్య వినాశన నమః
- కన్య రాశి : ఓం పంచవక్త్రాయ నమః:
- తులా రాశి : ఓం సర్వగ్రహ వినాశినే నమః
- వృశ్చిక రాశి : ఓం సర్వబంధ్విమోక్త్రే నమః
- ధనుస్సు రాశి : ఓం చిరంజీవితే నమః
- మకర రాశి : ఓం సురార్చితే నమః
- కుంభ రాశి : ఓం వజ్రకాయ నమః
- మీన రాశి : ఓం కామరూపిణే నమః
పూజా విధానం
హనుమాన్ జయంతి రోజున ( ఏప్రిల్ 12) బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనడం శుభప్రదంగా భావిస్తారు. ఎరుపు లేదా నారింజ రంగులో ఉన్న శుభ్రమైన దుస్తులను ధరించండి. ఇంట్లో పూజ చేయలనుకుంటే ముందుగా పూజ చేసే ప్రాంతంలో గంగా జలంతో శుద్ధి చేయండి. తరువాత ఒక పీఠం ఏర్పాటు చేసి దాని మీద ఎర్రటి గుడ్డను పరిచి, హనుమంతుని విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్టించండి. అలాగే సీతారాముల చిత్రపటాన్ని కూడా ఉంచుకోండి. సింధూరం, మల్లె నూనె, ఎర్రటి పువ్వులు, పూలమాల, పవిత్ర దారం, కలశం, ధూపం, దీపం, కర్పూరం, కొబ్బరి కాయ, బెల్లం, శనగపిండి లడ్డు లేదా బూందీ లడ్డు, అరటిపండు, డ్రై ఫ్రూట్స్, పంచామృతం (పాలు, పెరుగు, నెయ్యి, తేనె , చక్కెర మిశ్రమం), గంగా జలం, తులసి ఆకులు మొదలైనవి పూజ చేసే చోట పెట్టండి.
►ALSO READ | ఆధ్యాత్మికం : నేనే గెలవాలి.. నీవు ఓడాలి అన్న సూత్రంపై.. మహా భారత యుద్ధంలో గెలిచింది ఎవరు..?
దీపారాధన చేసి .మనసులోని కోరిక చెప్పుకొని నెరవేరాలని. సంకల్పం చదువుకొని హనుమాన్ చాలీసా.. సుందరాకాండ పారాయణంచేయాలి. ఆ తరువాత హనుమంతుని అష్టోత్తరంతో పూజ చేసి.. పైన తెలిపిన విధంగా ఆయా రాసులవారు ఆ మంత్రాన్ని పఠించాలి. ధూప.. దీప.. నైవైద్యం.. హారతి ఇచ్చి.. దగ్గరలోని ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించాలి. ఆ తరువాత బ్రాహ్మణులకు దక్షణ తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటే.. మనసులోని కోరికలు తప్పకుండా నెరవేరతాయని పండితులు చెబుతున్నారు.