ఫోన్ ఫే, గూగుల్ పే, అమెజాన్ పే, ఇలా చాలా ఆన్ లైన్ పేమెంట్ ప్లాట్ ఫాంలు ఇప్పడు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇవ్వన్ని కూడా ఒకే రకమైన పేమెంట్ అదే యూపీఐ పేమెంట్స్. ఇవి యూపీఐ పిన్ తో నడుస్తాయి. చాలామంది యూపీఐ పిన్ మర్చిపోయి ఇబ్బంది పడుతుంటారు. వారికి పిన్ ఛేంజ్ చేసుకునే ఆప్షన్ తెలియక కంగారు పడుతుంటారు. ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ పిన్ ఏలా మార్చుకోవాలో చూద్దాం..
UPI PIN అంటే యూనిఫైయిడ్ ఫేమెంట్స్ ఇంటర్‌ఫేస్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇది నాలుగు లేదా ఆరు అంకెల నెంబర్. యూపీఐ పేమెంట్స్ వాడే యూజర్స్ క్రియేట్ చేసుకోవాల్సిఉంటుంది. యాప్ ఓపెన్ చేసి బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత యూపిఐ పిన్ ఛేంజ్, రీసెట్ యూపీఐ పిన్ ఎంచుకోండి. తర్వాత ఏటీఎం కార్డ్, బ్యాంక్ అకౌంట్ డీటెల్స్ నింపాలి. ఏటీఎం కార్డ్ వివరాలు నింపగానే రిజిస్టర్ మొబైల్ ఫోన్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటైర్ చేసి క్రియేట్ పిన్ అని దాని తర్వాత కంఫామ్ పిన్( కంఫామ్) చోట్ల మీరు సెట్ చేసుకోవాలనుకునే నెంబర్ ను ఎంటర్ చేయాలి.