పాన్ కార్డ్ ఐడీకి క్యూఆర్ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: పర్మనెంట్​ అకౌంట్​ నంబర్​ (పాన్​ కార్డు)కు సంబంధించిన మోసాలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో అలెర్టయిన ప్రభుత్వం పాన్ కార్డ్ ఐడీకి క్యూఆర్ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను చేర్చడం మొదలుపెట్టింది. 2018 జూలై తర్వాత జారీ అయినన అన్ని పాన్ కార్డ్‌‌‌‌‌‌‌‌లలో క్యూఆర్ కోడ్ ఉంటుంది. పాన్ కార్డ్‌‌‌‌‌‌‌‌ క్యూఆర్ కోడ్ ద్వారా నకిలీలను గుర్తించడం ఈజీ అవుతుంది. ఇందుకోసం స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్‌లో  ఆదాయపు పన్ను శాఖ యాప్ ఉండాలి. కరోనా కాలంలో బోగస్ పాన్ కార్డుల కేసులు క్రమంగా పెరిగినట్టు రిపోర్టులు వచ్చాయి. మీ దగ్గర ఉన్న పాన్ కార్డ్ అసలైనదా లేదా నకిలీదా అని నిర్ధారించుకోడం చాలా ముఖ్యం.     పాన్​కార్డుతో ఇవీ లాభాలు..
 నిజానికి పాన్​కార్డుతో నేరుగా ప్రయోజనాలు ఏవీ ఉండవు కానీ బ్యాంకింగ్,  ఇతర ఆర్థిక అవసరాలకు ఇది చాలా ముఖ్యం. డీమాట్  మొదలుకొని బ్యాంక్ ఖాతా తెరవడం వరకు.. చాలా పనులకు పాన్ కార్డ్ కావాలి.  పాన్ ఉపయోగించి బ్యాంక్ ఖాతాను తెరవవచ్చు. ఆస్తి కొనొచ్చు లేదా అమ్మవచ్చు. వెహికల్​ కొనుగోలుకు లేదా అమ్మకానికి పాన్​ తప్పనిసరి. దీంతో ఐటీఆర్ సమర్పించడానికి ఇది కచ్చితంగా కావాలి. రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ విలువైన నగలను కొనుగోలు చేయాలంటే పాన్​ నంబరు ఇవ్వాలి.  రియల్ ఎస్టేట్ లావాదేవీలకూ ఇవ్వాలి. 
పాన్ కార్డ్  చెకింగ్​ ఇలా:

1:    ఐటీ శాఖ  ఈ–-ఫైలింగ్ పోర్టల్‌‌‌‌‌‌‌‌కి వెళ్లండి.
2:    పేజీకి కుడి వైపున, "మీ పాన్ డేటాను వెరిఫై చేయండి" అని పేర్కొనే లింక్‌‌‌‌‌‌‌‌పై క్లిక్ చేయండి.
3:    యూజర్లు ఇప్పుడు తప్పనిసరిగా వారి పాన్ కార్డ్ సమాచారాన్ని నింపాలి
4:    వెంటనే మీకు పాన్ నంబర్, పాన్ కార్డ్ హోల్డర్ పూర్తి పేరు, పుట్టిన తేదీ మొదలైన సమాచారం కనిపిస్తుంది.
5:    వివరాలు ఇచ్చాక.. పోర్టల్​లోనిని సమాచారం మీ పాన్ కార్డ్‌‌‌‌‌‌‌‌తో సరిపోలిందో లేదో పేర్కొంటూ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ వస్తుంది.