శారీరక, మానసిక మార్పుల వల్ల తలనొప్పి వస్తుంది. పనిలో ఒత్తిడి పెరిగినప్పుడు కూడా ఇది వచ్చే ప్రమాదముంది. ఇది మీ మానసిక స్థితిని నాశనం చేస్తుంది. సమ్మర్లో చాలామంది డీహైడ్రేషన్‌కు గురవుతారు. దీనివల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే మీరు నిత్యం దీనితో ఇబ్బంది పడుతుంటే.. మాత్రలు మానేసి.. సహజమైన మార్గాల్లో దానిని తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. తలనొప్పిని సహజంగా ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
నీరు ఎక్కువగా తాగాలి
డీహైడ్రేషన్ తలనొప్పికి దారి తీస్తుంది. ఏ కారణంతో అయినా తలనొప్పి వస్తుంటే.. పుష్కలంగా నీరు తాగండి. ఇది మీరు హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహయపడుతుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగానే తాగాలి.
ఒత్తిడిని తగ్గించి
ఒత్తిడి తలనొప్పిని, మైగ్రేన్‌ను ప్రేరేపిస్తుంది. వివిధ కారణాలతో కొన్నిసార్లు ఒత్తిడికి గురికావచ్చు. ఆ సమయంలో డీప్ బ్రీత్ తీసుకోవడం, ధ్యానం, యోగా వంటివాటిని చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. నచ్చని ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు నచ్చిన ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా ఒత్తిడి తగ్గుతుంది.
అరోమా థెరపీ
తలనొప్పిని సహజంగా వదిలించుకోవడానికి అరోమా థెరపీ సహజమైన మార్గంగా చెప్పవచ్చు. మీకు నచ్చిన సువాసనను ఎంచుకోండి. జాస్మిన్, లావెండర్ వంటి సువాసనలు ఒత్తిడిని తగ్గించి తలనొప్పి నుంచి ఉపశమనం ఇస్తాయి. ఇవి క్యాండిల్స్ రూపంలో అందుబాటులో ఉంటాయి. ఆ సమయంలో మీరు ఫోన్‌కు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటే మంచిది. లావెండర్, యూకలిప్టస్ వంటి నూనెల్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తలనొప్పిని తగ్గించడమే కాకుండా ఇంద్రియాలకు ఉపశమనం కలిగిస్తాయి.
ఆక్యుప్రెషర్
ఆక్యుప్రెషర్ అనేది సాంప్రదాయమైన చైనీస్ హీలింగ్ టెక్నిక్. ఇది తలనొప్పి నుంచి ఉపశమనం ఇవ్వడమే కాకుండా.. శరీరంపై నిర్దిష్ట బిందువులపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల మీకు ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆక్యుప్రెషర్ పాయింట్లు ప్రేరేపించడం వల్ల తలనొప్పి సమస్య తగ్గడంతో పాటు.. ఫ్రీక్వెంట్‌గా రావడం కూడా తగ్గుతుంది.
కోల్డ్ కంప్రెస్
నుదిటిపై లేదా మెడకు కోల్డ్ కంప్రెస్ వేయడం వల్ల తలనొప్పిని దూరం చేసుకోవచ్చు. ఇది వేగంగా, ప్రభావవంతగా పనిచేస్తుంది. కోల్డ్ థెరపీ రక్తనాళాలను సంకోచించేలా చేస్తుంది. మంటను తగ్గించి.. ఆ ప్రాంతాన్ని తిమ్మిరి లక్షణాలకు దూరం చేస్తుంది. తలనొప్పి వంటి అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.