సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(CBDT) పాన్ కార్డుకు ఆధార్ నంబర్ తో లింక్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆధార్ తో పాన్ ను లింక్ చేయడంలో విఫలం అయితే పాన్ కార్డు పనికి రాకుండా పోతుంది. ఆదాయపు పన్ను రిటర్న్ లు (ITR), ఆర్థిక లావాదేవీల నిర్వహణ, బ్యాంకింగ్ సేవలను యాక్సెస్ చేయడం సాధ్యం కాదు.
పాన్ -ఆధార్ లింకింగ్ స్థితిని ఎలా తనిఖీ చేయాలి
- Incomtax.gov.in/iec/foportal/లో ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
- క్విక్ లింక్ విభాగానికి వెళ్లి లింక్ ఆధార్ స్టేటస్ ని ఎంచుకోవాలి
- పాన్ , ఆధార్ కార్డ్ నంబర్లను నమోదు చేయాలి
- వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అప్షన్ పై క్లిక్ చేయాలి
- స్క్రీన్ పాన్ -ఆధార్ లింక్ ప్రస్తుత స్థితిని చూపిస్తుంది.
- లింక్ చేయబడింది అని చూపితే విజయవంతంగా లింక్ చేసినట్లు. లేకుంటే తిరికి రెండు కార్డులను లింక్ చేయాలని సూచిస్తుంది.