ట్యాక్స్ రీఫండ్ స్టేటస్ చెక్ చేసుకోండి ఇలా

ట్యాక్స్ రీఫండ్ స్టేటస్ చెక్ చేసుకోండి ఇలా

న్యూఢిల్లీ: 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్‌‌కమ్‌‌ ట్యాక్స్ రిటర్న్స్‌‌ ఫైల్ చేయడానికి ఈ నెల 31 చివరి తేదీ. ఐటీఆర్‌‌‌‌లను  డెడ్‌‌లైన్‌‌లోపు ఫైల్ చేయకపోతే  రూ.5 లక్షల లోపు ట్యాక్స్ కట్టాల్సిన వారిపై రూ.1,000, రూ.5 లక్షల కంటే ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సిన వారిపై రూ.5 వేలు పెనాల్టీ పడుతుంది. ఇప్పటికే ఐటీఆర్‌‌‌‌లను ఫైల్ చేసి, అర్హత ఉన్నవారు రీఫండ్స్‌‌ కూడా పొందుతున్నారు. ఒక్కసారి ఐటీఆర్ ఫైల్ చేశాక 20–45 రోజుల్లో రీఫండ్ ప్రాసెస్‌‌ను  ఇన్‌‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌‌ పూర్తి చేస్తుంది. ట్యాక్స్ రీఫండ్‌‌ స్టేటస్‌‌ను కింది విధంగా చెక్‌‌ చేసుకోవచ్చు.


ఇన్‌‌కమ్‌‌ ట్యాక్స్ ఈ–ఫైలింగ్ పోర్టల్‌‌కు వెళ్లి యూజర్ ఐడీ, పాస్‌‌వర్డ్‌‌, డేట్ ఆఫ్ బర్త్‌‌ లేదా కంపెనీ స్టార్ట్‌‌ అయిన డేట్‌‌, క్యాప్చాను ఎంటర్ చేయాలి. మై అకౌంట్‌‌లోకి వెళ్లి రీఫండ్‌‌ లేదా డిమాండ్ స్టేటస్‌‌ను క్లిక్ చేయాలి. అసెస్‌‌మెంట్ ఇయర్‌‌‌‌, స్టేటస్‌‌, రిఫండ్ ఫెయిల్ అయితే గల కారణం, పేమెంట్ విధానం వంటి వివరాలు డిస్‌‌ప్లే అవుతాయి. ఈ విధంగా రిఫండ్‌‌ స్టేటస్‌‌ను చెక్ చేసుకోవచ్చు.

భారీగా ఫైల్ అయిన రిటర్న్‌‌లు..

2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ నెల 19 నాటికి 3 కోట్ల ఐటీఆర్‌‌‌‌లు ఫైల్ అయ్యాయని ఇన్‌‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌‌మెంట్ ప్రకటించింది. ఇందులో 91 శాతం రిటర్న్‌‌లను ఆన్‌‌లైన్‌‌లోనే వెరిఫై చేశామని తెలిపింది. కిందటేడాదితో పోలిస్తే  మూడు కోట్ల రిటర్న్‌‌ల మైలురాయిని ఈ ఏడాది ఏడు రోజుల ముందుగానే చేరుకున్నామని వివరించింది. కాగా, ఆధార్‌‌‌‌తో లింక్  చేయకపోవడంతో ఎన్‌ఆర్‌‌ఐల పాన్ కార్డ్ పనిచేయకుండా పోతే,  తమ రెసిడెన్షియల్ స్టేటస్‌‌ను జూరిస్‌‌డిక్షనల్‌‌ అసెసింగ్‌‌ ఆఫీసర్‌‌‌‌ వద్ద  సబ్మిట్ చేసి పాన్‌‌ను మళ్లీ యాక్టివ్​ చేసుకోవాలని ట్యాక్స్ డిపార్ట్‌‌మెంట్ ప్రకటించింది.