Food Tip : నెయ్యిలో కల్తీ ఉందా లేదా అనేది ఇలా గుర్తించాలి..

Food Tip : నెయ్యిలో కల్తీ ఉందా లేదా అనేది ఇలా గుర్తించాలి..

దేశంలో ఆహార పదార్థాల కల్తీ అనేది ఒక మాఫియాలా తయారైంది. ఇందులో భాగంగా పోలీసులు చాలామందిని అరెస్ట్ చేస్తున్నా ఈ దందా మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా మనం రోజు వాడే నెయ్యి విషయంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. నిజమైన నెయ్యి, నకిలీ నెయ్యి రెండూ మార్కెట్లలో అమ్ముడవుతున్నాయి. అటువంటి పరిస్థితిలో మీరు నెయ్యి తినడానికి ఇష్టపడితే జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే కొనండి. కల్తీ నెయ్యిని తయారు చేయడానికి చాలా చెడ్డ పదార్థాలు ఉపయోగించబడుతున్నాయి. స్వచ్ఛమైన దేశీ నెయ్యిని గుర్తించడానికి ఈ టెక్నిక్స్‌ని వాడండి.

నెయ్యి.. ఆరోగ్యానికి చాలా మంచిది. భారతీయులు భోజన సమయంలో నెయ్యి వాడకం కాస్త ఎక్కువనే చెప్పాలి. వంటల తయారీలతోపాటు.. భోజనం చేసే సమయంలోనూ నెయ్యిని తీసుకుంటారు. ఇక ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే.. వారికి కచ్చితంగా నెయ్యి ఉండాల్సిందే. పిల్లలకు నెయ్యి కలిపిన ఆహారం భోజనంగా పెడితే.. చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. 

 ALSO READ : ఫుడ్ ఛాలెంజ్ : ఈ బ్రెడ్ ఆమ్లేట్ తింటే.. లక్ష రూపాయలు ఇస్తారు

అయితే.. ఒకప్పుడు అంటే.. అందరికీ ఇళ్లల్లోనే పాడి ఉండేది.. స్వచ్ఛమైన నెయ్యి దొరికేది. కానీ ఇప్పుడు అలా కాదు కదా.. అందరం బయట కొనుక్కోవాల్సిందే. ఆ మార్కెట్లో లభించే నెయ్యిలో ఏది స్వచ్ఛమైనదో కాదో చెప్పడం చాలా కష్టమనే చెప్పాలి. ఈ క్రమంలో బయట కొనాలంటే కూడా బయమేస్తోంది. బయట మనం మార్కెట్లలో కొనే నెయ్యిలో ఫ్రాగ్నెన్స్, ప్రెసర్వేటివ్స్ కలుపుతారు. వాటి వల్ల అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లలో ఎన్నో రకాల బ్రాండ్ల నెయ్యి అమ్ముతారు. అవి కూడా చూడటానికి స్వచ్చమైన నెయ్యి రంగులోనే కనిపిస్తాయి. దీంతో వాటిలో ఏది స్వచ్ఛమైనదో గుర్తించడం కాస్త కష్టమైన పనే అని చెప్పాలి.మార్కెట్లలో అమ్మే నెయ్యిల్లో చాలా మంది కొబ్బరి నూనె కూడా కలుపుతున్నారట. లేదా ఆల్మండ్ ఆయిల్.. కొందరైతే వనస్పతి కూడా కలుపుతారు. 

కల్తీ నెయ్యిని గుర్తించడం ఎలా...

Method 1

నెయ్యి స్వచ్ఛతను గుర్తించడానికి మొదటి పద్దతి ఇది. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని.. దానిని మీడియం మంట మీద వేడి చేయాలి. పాన్ వేడి అయిన తర్వాత.. దానిపై కొద్దిగా నెయ్యి ఉంచాలి. నెయ్యి వెంటనే కరిగిపోయి బంగారు వర్ణంలోకి వస్తే.. అది స్వచ్ఛమైనదిగా గుర్తించాలి. అలా కాకుండా కరగడానికి సమయం తీసుకొని.. కరిగిన తర్వాత పసుపు రంగులోకి మారితే.. అది కల్తీ నెయ్యి అని గుర్తించాలి.

Method 2

 నెయ్యిలో  కొబ్బరి నూనె కలిసిందో లేదో కూడా  గుర్తించొచ్చు. ముందుగా నెయ్యిని గాజు గిన్నెలో తీసుకొని.. దానిని డబల్ లేయర్డ్ పద్దతిలో కరిగించాలి. తర్వాత దానిని వేరే గాజు జార్ లోకి తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టాలి. అప్పుడు.. అది నెయ్యి.. కొబ్బరి నూనెగా విడిపోయి లేయర్లుగా గడ్డకడుతుంది.

​Method 3

టెస్ట్ ట్యూబ్ లో  కొద్దిగా నెయ్యి తీసుకొని వేడి చేయాలి. తర్వాత దానిలో కొద్దిగా గాఢత ఎక్కువగా ఉన్న హెచ్ సీఎల్ తో పాటు కొద్దిగా పంచదార వేయాలి. తర్వాత మిశ్రమాన్నికలపాలి. ఇప్పుడు ఆ నెయ్యి అడుగు భాగాన పింక్ లేదా రెడ్ కలర్ కనపడితే.. అది కల్తీ నెయ్యి అని అర్థం. దాంట్లో వనస్పతి కలిసిందని గుర్తించాలి. 

Method 4

 ఒక చెంచా నెయ్యిలో నాలుగైదు చుక్కల అయోడిన్ కలపండి. రంగు నీలం రంగులోకి మారితే నెయ్యి లోపల ఉడికించిన బంగాళాదుంపల టింక్చర్ ఉంటుంది.

Method 5

 స్వచ్ఛమైన నెయ్యిని గుర్తించడానికి మీ అరచేతిలో ఒక చెంచా నెయ్యి ఉంచండి. అది స్వయంగా కరగడం ప్రారంభిస్తే అది స్వచ్ఛమైనదని అర్థం చేసుకోండి. నెయ్యి గడ్డకట్టి సుగంధం దాని నుంచి రావడం ఆపివేస్తే అది నకిలీదని అర్థం చేసుకోండి.