కిచెన్ శుభ్రంగా లేకపోతే వైరస్ , బ్యాక్టీరియాలు మనతోనే ఉంటాయి. అవి మనతో ఉంటే ఏం జరుగుతంతో తెలిసిందే కదా.... రోగాలు మేమున్నామంటాయి. మరి ఆ రోగాలను పుట్టించే బ్యాక్టీరియాల గురించి తెలుసుకుంటే హెల్త్ కాపాడుకోవచ్చు. కిచెన్ క్లీన్ గా ఉంచుకోవచ్చు.
సాల్మొనెల్లా,పాథోజెనిక్ ఇ- కోలి, ఎస్ . ఆరియస్ కాంపిలో బ్యాక్టర్ వంటి బ్యాక్టీరియాలు కిచెన్ లో ఎక్కువుగా ఉంటాయి. అవిఎక్కడెక్కడ ఉంటాయంటే... డస్ట్ బిన్ ల దగ్గర, కిచెన్ సింక్ లో బ్యాక్టీరియా చేరడానికి కారణం... పెస్టిసైడ్స్ తో పెరిగిన పండ్లు, కూరగాయలతో పాటు పచ్చి మాంసాలైన చికెన్, మటన్, చేపలను సింక్ ను శుభ్రం చేయడం. ఇదే కాకుండా తిన్న తర్వాత మిగిలిపోయిన పదార్ధాలను, వంట పాత్రలను సింక్ లో కడుగుతారు. దానివల్ల కూడా బ్యాక్టీరియా పెరిగే ఛాన్స్ ఉంది. కిచెన్ నుంచి వేగంగా రోగాలు వ్యాపించడానికి మొదటి కారణం ఈ పనులే. అలాగే రిఫ్రిజిరేటర్ హ్యాండిల్ కూడా బ్యాక్టీరియా వ్యాప్తికి కారణమవుతుంది. ఇంట్లో ఉన్న ట్యాప్ తిప్పే హ్యాండిల్స్ , మసిగుడ్డ, ఇళ్లు తుడిచే బట్ట, స్పాంజ్ లేదా కర్రలను ఎక్కువుగా తాకుతుంటారు. ఆ తరువాత చేతులు శుభ్రంగా కడుక్కోకపోతే తిప్పలు తెచ్చుకున్నట్టే. అదెలాగంటే.. చేతులు కడుక్కోకుండా తిన్నప్పుడు బ్యాక్టీరియా కడుపులోకి చేరుతుంది. చేతులపై ఉండే మైక్రో బ్యాక్టీరియా కంటికి కనిపించదు.
వంట చేసేటప్పుడు వాడే మసిగుడ్డలో ఇ -కోలి అనే బ్యాక్టీరియా ఎక్కువుగా ఉంటుంది. అది 48 గంటల పాటు అనగా రెండు రోజుల పాటు యాక్టివ్ గా ఉంటుంది. వానాకాలంలో మరింత జాగ్రత్త అవసరం. ఎందుకంటే తడి ప్రదేశాల్లో బ్యాక్టీరియా వైరస్ ల సంఖ్య పెరిగిపోతుంది.
కిచెన్ క్లీన్ టిప్స్
- కిచెన్ క్లీనింగ్ కి యాంటి మైక్రో బయల్ ఏజెంట్స్ వాడాలి. అవి అనారోగ్యం కలిగించే బ్యాక్టీరియాను చంపేస్తాయి
- యాంటి జెర్మ్ ప్రొటెక్షన్ ఉన్న సబ్బులు, లిక్విడ్స్ వాడాలి. వంట పాత్రల్ని సబ్బుతో కడిగినా, ఫ్రిజ్, ట్యాప్ హ్యాండిల్స్ ను లిక్విడ్స్ తో తుడిస్తే జెర్మ్స్ చచ్చిపోతాయి. మంచి వాసన రావాలంటేఅరోమా ఉన్న లిక్విడ్స్ వాడాలి.వంట గట్టును ప్రతి రోజూ శుభ్రం చేయాలి. పాలు, పప్పుచారు వంటివి పొంగినా.. దోసె పిండి, కూర ముక్కలు గట్టు మీద పడినా గాలికి ఆరి పేరుకుపోతాయి. వాటిమీద బొద్దింకలు తిరిగి బ్యాక్టీరియాలు చేరుతాయి. అందుకని ఎప్పటికప్పుడు వంటగట్టు క్లీన్ చేసుకుంటే.... హెల్త్ దెబ్బతినకుండాచూసుకోవచ్చు....