
ఇంటిని రెగ్యులర్‌గా క్లీన్ చేయడం ఎంతో మంచిది. దీని వల్ల ఎన్నో రోగాలను కంట్రోల్ చేసినవారమవుతాం. మార్కెటింగ్ పుణ్యమా అని ఇప్పుడు ప్రతి ఇంట్లో రకరకాల ఫ్లోర్ క్లీనర్స్ వాడేస్తున్నారు. వీటిలో ఉండే స్ట్రాంగ్ కెమికల్స్ వల్ల ఫ్లోర్ శుభ్రంగా ఉండటం మాటేమో కానీ.. రకరకాల జబ్బులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. వీటితో క్యాన్సర్ లాంటి తీవ్రమైన సమస్యలు వస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందుకే మనమే ఓ ఫ్లోర్ క్లీనరిని తయారు చేసుకుంటే ఏడాదికి రెండు మూడు వేల రూపాయలు ఆదా అవడంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది. కెమికల్ క్లీనర్స్ తో పోల్చుకుంటే వీటివల్ల లాభాలు కూడా ఎక్కువే!
1 . విట్రిఫైడ్ టైల్స్ ఉంటే సబ్బు నీళ్ళతో తుడవకూడదు. మూడు నాలుగు లీటర్ల గోరు వెచ్చని నీటిలో అరకప్పు వెనిగర్ కలిపి తుడిస్తే ఇల్లు అద్దంలాగా మెరిసిపోతుంది. మార్పుల్ ఫ్లోరింగు ఎసిడిక్ సొల్యుషన్ పనికి రాదు. ఉడెన్ ఫ్లోర్లయితే రెగ్యులర్ గా వాక్యుమ్ క్లీనింగ్ చేస్తుంటే ముందు జాగ్రత్తలు పడకపోయినా పర్లేదు. ఉడెన్ ఫ్లోర్ అయితే మరకలు పడితే ఆ ప్రదేశంలో నీళ్లు స్ప్రే చేసి, తడి గుడ్డతో తుడిచేసినా పోతాయి.
2. నేచురల్ ఫ్లోర్ క్లీనర్ కోసం పటిక, ఉప్పు, కర్పూరం బిళ్లలు ఉంటే సరిపోతుంది. పటిక ఫ్లోర్ మీద ఉండే చిన్న చిన్న క్రిములను చంపే యాంటిబయాటిక్ లా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇంట్లో పసి పిల్లలు ఉన్నవారు పటికతో ఫ్లోర్ శుభ్రం చేస్తే.. పిల్లలకి ఎలాంటి అలెర్జీలు రాకుండా ఉంటాయి.
Also Read : ఎర్రటి.. తియ్యటి పుచ్చకాయను గుర్తించడం ఎలా..
3. ఉప్పుతో తుడిస్తే మార్బుల్ ఫ్లోరింగ్ తళతళలాడిపోతుంది. చీమలు, చిమట్లు నేల మీద పాకకుండా చేస్తుంది.
4. ఇంటిని తుడిచే నీటిలో కొద్దిగా సోడా వేయండి. ఇలా చేస్తే ఇంట్లో ఉండే జిడ్డు, మరకలు పోయి మెరుస్తుంటుంది.
5. క్లీన్ చేసే నీటిలో ఉప్పు కలిపితే దోమలు, ఈగలు, సూక్ష్మక్రిములు రావు. కొంచెం పసుపు కలిపినా అందులోని యాంటీబయాటిక్ లక్షణాలు చెత్తని క్లీన్ చేస్తాయి. ఇంట్లో ఏదైనా మూల కర్పూరం వెలిగిస్తే సువాసన రావడమే కాదు.. చిన్న చిన్న క్రిములు కూడా నాశనమవుతాయి.
6. ఎక్కడైనా మరకలు వదలకుంటే నిమ్మరసం, నిమ్మతొక్కలతో రుద్దితే మరకలు మాయమవుతాయి.
7. ఇక కర్పూరం ఓ గొప్ప రిపెల్లంట్ గా పని చేస్తుంది. దీంతో ఈగలు, దోమలు, బొద్దింకలు అంత త్వరగా ఇంట్లోకి రావు. పైగా మంచి వాసన కూడా వస్తుంది