సైంటిఫిక్ వే..గుడ్డును పర్ఫెక్ట్గా ఉడికించడం ఎలా?

సైంటిఫిక్ వే..గుడ్డును పర్ఫెక్ట్గా ఉడికించడం ఎలా?

సాధారణంగా మనం గుడ్డును ఉడకబెట్టినప్పుడు పర్ఫెక్ట్గా రాదు..ఏదో ఒక లోపం ఉంటుంది..ఎక్కువ వేడితో ఉడికిస్తే తెల్లసొన బాగా ఉడికి.. పచ్చసొన పొడిగా మారుతుంది. అదే విధంగా తక్కువ మంటతో ఉడికిస్తే..తెల్లసొన ఉడుకుతుంది కానీ పచ్చ సొన లూజ్ గా ఉంటుంది.. మరీ తెల్లసొన, పచ్చసొన రెండూ పర్ఫెక్ట్గా ఉడకాలంటే.. 

ఒకటి రెండు గుడ్లు ఉడకబెట్టడంలో పెద్ద డ్యామేజీ ఏమీ ఉండకపోయినా.. హాస్టళ్లు, హోటళ్లు, ఇతర ఫంక్షన్లలో పెద్ద మొత్తంలో బాయిల్డ్ చేస్తుంటారు.. అలాంటి సమయాల్లో  ఓగుడ్డు ఉడికి, మరోగుడ్డు ఉడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి సమయంలో న్యూయార్క్ పరిశోధకులు ఓ ట్రిక్ కనిపెట్టారు. 

న్యూయార్క్ కు చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు పర్ఫెక్ట్గా గుడ్డు ఉడకబెట్టేందు ఓ ట్రిక్(చిట్కా) కనుక్కున్నారు. సరిగ్గా ఉడికించిన గుడ్డులో వెల్వెట్ లాంటి మృదువైన పచ్చసొన, దృఢమైన తెలుపు రంగు ఉంటాయి. ఇలా సమంగా తెల్లసొన, పచ్చసొన సమతుల్యంగా ఉడకాలంటే ఓ సవాల్. ఎందుకంటే పచ్చసొన తెల్లసొన కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడుకుతుంది. గుడ్డును గట్టిగా ఉడకబెట్టడం వల్ల సుద్దలాంటి పచ్చసొన వస్తుంది, తక్కువ,నెమ్మదిగా ఉడికించడం వల్ల జెల్లీ లాంటి, తక్కువగా ఉడికించిన తెల్లసొన వస్తుంది.

పర్ ఫెక్ట్ గా గుడ్డును ఉడికించడం అనే సమస్యను పరిష్కరించేందుకు ఓ ఫార్ములాను ఉపయోగించారు.  గుడ్డు ఉపరితలం, మధ్యలోకి వేడిని ఎలా పంపిస్తే గుడ్డు లోని తెల్లసొన, పచ్చసొన ద్రవపదార్థం నుంచి ఘన పదార్థంగా మారుతాయే కనిపెట్టారు. 

ALSO READ | Astrology: ఫిబ్రవరి 11న కుంభరాశిలో బుధుడు .. శని కలయిక .. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..

ఇందుకోసం ఒకగిన్నెలో నీటిని మరిగించడం, మరొక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకున్నారు. ప్రతి రెండు నిమిషాలకొకసారి గుడ్లను ఈ రెండు రకాల వేడి నీటి మధ్య మార్చుతూ వచ్చారు. ఇలా అర్థగంటపాటు చేశారు.. పొట్టు తీస్తే పర్ఫెక్ట్గా ఉడికిన గుడ్డును చూశారు. ఇంట్లో అర డజను గుడ్లతో ఇలా ఖచ్చితంగా చేస్తే పర్ఫెక్ట్గా ఉడికిన గడ్లు పొందవచ్చు. 

ఈ పద్దతిని ఆవర్తన వంటి అని పరిశోధకులు అంటున్నారు. ఇలా చేస్తే గుడ్డులోని తెల్లసొన పూర్తిగా సెట్ అయ్యే వరకు వేడి చేసి చల్లబరుస్తుంది.. మరోవైపు పచ్చ సొన స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద గట్టిగా ఉండి క్రీమీ అయ్యే వరకు ఉడికిస్తుందని తేల్చారు. ఈ పరిశోధన గురువారం కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ జర్నల్‌లో ప్రచురిం చబడింది.

ఈ కొత్త టెక్నిక్ తో సాధారణంగా ఉడికించిన గుడ్డు కంటే సమయం ఎక్కువ తీసుకున్నా.. చాలా టేస్టీగా ఉంటుందని మిన్నెసోటా విశ్వవిద్యాలయానికి చెందిన ఆహార శాస్త్రవేత్త జోవాన్ స్లావిన్ చెబుతున్నారు.