టార్గెట్​ టాప్​ సర్వీస్​

రాష్ట్రంలోని అత్యున్నత సర్వీస్​ అయిన గ్రూప్​ 1 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్​ రానుంది. 503 పోస్టులకు ఇప్పటికే ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. సొంత రాష్ట్రంలో ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులుగా ప్రమోషన్​ పొందే ఈ పోస్టులకు పోటీ తీవ్రంగా ఉంది. ప్రిలిమ్స్​, మెయిన్స్​, ఇంటర్వ్యూ మూడు దశల్లో నిర్వహించే ఈ ఎగ్జామ్​ ప్రిపరేషన్​ ప్లాన్​, పరీక్ష విధానం, సిలబస్​ గురించి తెలుసుకుందాం.. 

రాష్ర స్థాయిలో అత్యున్నత స్థాయి గెజిటెడ్‍ పోస్టులు గ్రూప్‍–I సర్వీసులు. దీని ద్వారా  డిప్యూటీ కలెక్టర్స్, కమర్షియల్‍ ట్యాక్స్ ఆఫీసర్స్, డిప్యూటీ సూపరింటెండెంట్‍ ఆఫ్‍ పోలీస్‍, మున్సిపల్​ కమిషనర్​ లాంటి టాప్​ సర్వీస్​లు సొంతం చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ చేసినవారు ఈ పోస్టులకు అర్హులు. 
సెలెక్షన్‍ ప్రాసెస్‍: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. ప్రిలిమ్స్ లో జనరల్‍ స్టడీస్‍, జనరల్‍ ఎబిలిటీస్‍ పేపర్‍లో 150 మార్కులకు 150 ప్రశ్నలు వస్తాయి. సమయం రెండున్నర గంటలు. ప్రశ్నలన్నీ డిగ్రీ స్థాయిలో ఉంటాయి. ప్రిలిమ్స్ లో అర్హులైన వారికి ఆరు పేపర్లతో డిస్ర్కిప్టివ్‍ పద్ధతిలో మెయిన్స్ నిర్వహిస్తారు. దీనిలో ఇంగ్లిష్‍ పరీక్షను క్వాలిఫైయింగ్‍ పేపర్‍గా నిర్దేశించారు. మెయిన్స్‌‌‌‌‌‌‌‌లో అర్హులైన వారికి 100 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. 

ప్రిపరేషన్​ ప్లాన్​ 
స్టార్ట్​ విత్​ సిలబస్​: గ్రూప్1 ప్రిపరేషన్​  విస్తృతంగా ఉంటుంది. ముందుగా సిలబస్​ పూర్తిగా అర్థం చేసుకొని ఏ సబ్జెక్ట్​లో ఏ టాపిక్స్​ మీద ఫోకస్​ చేయాలో గమనించాలి. తమకు అనుకూలంగా ఉండే అంశాలు.. ప్రతికూలంగా లేదా కొత్తగా ఉండే అంశాలు ఏవో గుర్తించాలి. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ విస్తృతంగా ఉంటాయి. వీటితోపాటు కరెంట్‌‌‌‌‌‌‌‌ అఫైర్స్, కాంటెంపరరీ ఇష్యూస్‌‌‌‌‌‌‌‌కూ ప్రాధాన్యం ఇస్తూ ప్రిపరేషన్​ కొనసాగించాలి. పరీక్ష విధానం తెలుసుకోవడం వల్ల ప్రిలిమ్స్, మెయిన్స్‌‌‌‌‌‌‌‌ రెండింటిలో ఉన్న పేపర్లు, అంశాల గురించి అవగాహన ఏర్పడి.. ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌ సమయంలో నిర్దిష్ట

వ్యూహంతో చదవొచ్చు.
ప్రీవియస్​ పేపర్స్​ ప్రాక్టీస్​: అభ్యర్థులు ప్రీవియస్​ పేపర్స్​ ప్రాక్టీస్​ చేయాలి. ప్రశ్న పత్రాలను అధ్యయనం చేయడం ద్వారా ఆయా అంశాలకు లభిస్తున్న వెయిటేజీ, ప్రశ్నలు అడుగుతున్న తీరు తెలుసుకోవచ్చు. కనీసం అయిదేళ్ల పాత ప్రశ్న పత్రాలు సాధన చేస్తే  ప్రశ్నల సరళిపై అవగాహన లభిస్తుంది.

బుక్స్​: సిలబస్, పరీక్ష తీరు, ప్రశ్నల శైలిపై అవగాహన పొందిన తర్వాత.. అభ్యర్థులు ప్రామాణిక పుస్తకాలను సేకరించాలి. పరీక్ష సిలబస్‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగా ఆయా సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌లకు సంబంధించి..అన్ని అంశాలు ఉండే పుస్తకాలను సమీకరించుకోవాలి. పుస్తకాలు, మెటీరియల్‌‌‌‌‌‌‌‌ ఎంపికలో గత విజేతలు లేదా సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
స్టడీ ప్లాన్‌‌‌‌‌‌‌‌:  మెటీరియల్‌‌‌‌‌‌‌‌ చేతికి వచ్చాక..  అన్ని సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌లకు సమయం కేటాయించేలా టైమ్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ రూపొందించుకోవాలి. ప్రతిరోజు, ప్రతి సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌ చదివేలా సమయాన్ని విభజించుకోవాలి. క్లిష్టమైన అంశాలకు కొంత ఎక్కువ సమయం కేటాయించాలి.

సొంత నోట్స్​: ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌ సమయంలో ప్రతి సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌ను చదువుతున్నప్పుడే.. అందులోని ముఖ్యాంశాలతో సొంత నోట్స్‌‌‌‌‌‌‌‌ రాసుకోవాలి. ఈ నోట్స్‌‌‌‌‌‌‌‌లో సదరు సిలబస్‌‌‌‌‌‌‌‌ అంశానికి సంబంధించి సినాప్సిస్, నేపథ్యం, సమకాలీన పరిణామాలు ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల పరీక్షకు ముందు రివిజన్‌‌‌‌‌‌‌‌ వేగంగా పూర్తిచేసుకోవచ్చు.
రైటింగ్​ ప్రాక్టీస్​: గ్రూప్‌‌‌‌‌‌‌‌1 మెయిన్స్​లో విజయం సాధించేందుకు రైటింగ్​ స్కిల్స్​ చాలా ముఖ్యం. ప్రతి రోజు తాము చదివిన అంశాలకు సంబంధించి ప్రీవియస్​ పేపర్స్​ లేదా మోడల్​ పేపర్స్​ ఆధారంగా సమాధానాలు రాసి సరిచూసుకోవాలి. తద్వారా రైటింగ్‌‌‌‌‌‌‌‌ స్కిల్స్, ప్రజెంటేషన్‌‌‌‌‌‌‌‌ నైపుణ్యాలు మెరుగుపడతాయి.
కరెంట్​ ఈవెంట్స్​: గ్రూప్స్‌‌‌‌‌‌‌‌ పరీక్షల శైలిని పరిశీలిస్తే.. అభ్యర్థులు కరెంట్​ ఎఫైర్స్​పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ట్రెండింగ్‌‌‌‌‌‌‌‌ టాపిక్స్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి టీవీ డిబేట్స్, న్యూస్‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌ అనాలిసిస్‌‌‌‌‌‌‌‌లను అనుసరించాలి. ఇవి ఆయా అంశాలపై లోతైన అవగాహన పొందేందుకు ఆస్కారం కల్పిస్తాయి.

సెల్ఫ్​ ఎనాలసిస్​: అభ్యర్థులు తమ ప్రిపరేషన్, అవగాహన స్థాయిపై నిరంతరం స్వీయ విశ్లేషణ, సమీక్ష చేసుకోవాలి. అందుకోసం నమూనా ప్రశ్న పత్రాలు ప్రాక్టీస్​ చేయడం, తాము చదివిన టాపిక్స్‌‌‌‌‌‌‌‌ నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్న వాటికి సమాధానాలు రాయడం చేయాలి. ఆ తర్వాత వీటిని వాల్యుయేషన్​ చేసుకుని తమ స్థాయి విశ్లేషించుకొని, ఎలా ఇంప్రూవ్​ చేసుకోవాలో చెక్​ చేసుకోవాలి. 
మెంటారింగ్‌‌‌‌‌‌‌‌: గత విజేతలు, సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌తో సంప్రదింపులు సాగించేలా ఏర్పాటు చేసుకోవాలి. అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌ స్థాయిపై కచ్చితమైన విశ్లేషణ, అవగాహన పొందేందుకు మెంటారింగ్‌‌‌‌‌‌‌‌ సౌకర్యం ఉపయోగపడుతుంది.

అందుబాటులో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌:  యూట్యూబ్‌‌‌‌‌‌‌‌లో ఉచితంగానే పరీక్షలకు ఉపయోగపడే సమాచారం లభిస్తోంది. సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌ నిపుణులు ఇచ్చే సలహాలు, సూచనలు పొందే అవకాశం ఉంది. కరెంట్‌‌‌‌‌‌‌‌ అఫైర్స్, జనరల్‌‌‌‌‌‌‌‌ ఎస్సే తదితర విభాగాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్నిఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ పోర్టల్స్‌‌‌‌‌‌‌‌ అందిస్తున్నాయి. ఓర్పు, సహనం కీలకం: గ్రూప్​1 ఎంపిక ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతుంది. కొన్ని సందర్భాల్లో సహనానికి పరీక్షగానూ మారుతుంది. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఓర్పుగా, సహనంతో అడుగులు వేయాలి. అభ్యర్థులు తమ లక్ష్య సాధన దిశగా అన్ని ఆటుపోట్లు తట్టుకుంటూ.. ఏకాగ్రత కోల్పోకుండా ఉండాలి. ఇలా సిలబస్‌‌‌‌‌‌‌‌ విశ్లేషణ నుంచి పరీక్ష రోజు వరకూ.. పక్కా ప్రణాళికతో, ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తే రాష్ట్ర స్థాయిలో టాప్​ సర్వీస్​ సొంతం చేసుకోవచ్చు.
                     
భర్తీ చేయనున్న పోస్టులు
డిప్యూటీ కలెక్టర్లు    42
వాణిజ్య పన్నుల అధికారులు    48
డీఎస్పీ (పోలీస్​)     91
డీఎస్పీ (జైళ్లు)    2
అసిస్టెంట్​ ఎక్సైజ్​ సూపరింటెం డెంట్లు    26
జిల్లా బీసీ సంక్షేమాధికారులు    5
సహాయ ఖజానా అధికారులు    38
సహాయ ఆడిట్​ అధికారులు    40
ప్రజారోగ్య పరిపాలన అధికారులు    20
సహాయ కార్మిక కమిషనర్లు    8
జిల్లా ఉపాధి అధికారులు    2
జిల్లా మైనార్టీ సంక్షేమాధికారులు    6
జిల్లా పంచాయతీ అధికారులు    5
జిల్లా రిజిస్ట్రార్లు ( రిజిస్ట్రేషన్​)    5
జిల్లా ఎస్సీ సంక్షేమాధికారులు    3
ప్రాంతీయ రవాణా అధికారులు    4
జిల్లా గిరిజన సంక్షేమాధికారులు    2
మున్సిపల్ కమిషనర్లు గ్రేడ్​–2    35
ఎంపీడీవో    121
మొత్తం    503

ఎగ్జామ్​ ప్యాటర్న్​ సబ్జెక్ట్​    మార్కులు

ప్రిలిమ్స్​
జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ 
(ఆబ్జెక్టివ్ టైప్)     150
 

మెయిన్స్​
జనరల్ ఇంగ్లిష్ (క్వాలిఫైయింగ్ టెస్ట్)    
పేపర్- I – ఎస్సే    150
పేపర్- II – ఇండియన్​ హిస్టరీ, 
కల్చర్​, జాగ్రఫీ    150
పేపర్ III – ఇండియన్ సొసైటీ, 
పాలిటీ మరియు గవర్నెన్స్​    150
పేపర్ -IV – ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి 
మరియు పర్యావరణ సమస్యలు    150
పేపర్- V – సైన్స్ అండ్​ టెక్నాలజీ 
మరియు డేటా ఇంటర్‌‌‌‌‌‌‌‌ప్రిటేషన్    150
పేపర్- VI – తెలంగాణ ఉద్యమం 
మరియు రాష్ట్ర ఏర్పాటు    150
             

ఇంటర్వ్యూ    100
మొత్తం    1000