మొబైల్ లేదా కంప్యూటర్ వాడే ప్రతిఒక్కరికీ కచ్చితంగా జీమెయిల్ అకౌంట్ ఉండే ఉంటుంది. మన డివైజ్‌లోని డేటా అంతా గూగుల్ అకౌంట్‌కు లింక్ చేసి ఉంటుంది. ఫొటోస్, వీడియోస్, డాకుమెంట్ ఫైల్స్ లాంటి చాలా ఇన్ఫర్మేషన్ జీమెయిల్ అకౌంట్ కు లింక్ అయిఉంటాయి. అందుకోసం చాలా స్టోరేజ్ కావాలి. ఉన్న కాస్త ఫ్రీ స్టోరేజ్ అసవరసమైన ఈ మెయిల్స్ తో నిండిపోయి ఉంటుంది. మీ జీమెయిల్ అకౌంట్ స్టేరేజ్ లిమిట్ అయిపోతే తర్వాత డబ్బులు పెట్టి స్టేరేజ్ కొనాల్సిఉంటుంది. మీ జీమెయిల్ ఖాతా స్టేరేజ్ ఫుల్ అయినప్పుడు దాంట్లో ఉన్న అనవసరపు మెయిల్స్ డిలెట్ చేసుకుంటే.. డబ్బులు పెట్టి బాక్‌అప్ స్టోరేజ్ కొనాల్సిన అవసరం లేదు.
అవసరంలేని స్పామ్ మెయిల్ వందల కొద్ది మన గూగుల్ స్టోరేజ్‌ను ఫుల్ చేస్తాయి. వాటిని ఎప్పటికప్పుడు డిలెట్ చేసుకుంటూ ఉంటే మనకు కావాల్సిన ఇతర యాప్స్ కు, గూగుల్‌కు లింక్ చేసిఉన్న అకౌంట్స్‌కు ఆ స్టోరేజ్ సరిపోతుంది. ఈ కామర్స్ నోటిఫికేషన్, ఆన్‌లైన్ పేమెంట్స్ మెసేజ్‍లు, యాడ్స్ ఇలా మనకు అవసరంలేని మెయిల్స్ అన్నీ చెత్తాచెదారంలా జీమెయిల్ నిండిపోయి అలాగే ఉండిపోతాయి. వాటన్నింటినీ డిలెట్ చేసుకుందామంటే వందల్లో ఉంటాయి. ఒక్కొక్కటి డిలెట్ చేసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. దానికి బదులుగా మల్టిపుల్ మెయిల్స్ ఒకేసారి సెలక్ట్ చేసుకొని డిలెట్ చేసుకొవచ్చు. అది ఏలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఫోన్‌లో లేదా డెస్క్‌టాప్‌లో గూగుల్ అకౌంట్ ఓపెన్ చేయండి. మెబైల్‌లో అయితే డెరెక్ట్‌గా ఆ మెయిల్ క్లిక్ చేసిపట్టుకుంటే సెలక్ట్ అవుతుంది. డెస్క్‌టాప్‌లో మెయిల్ పక్కనే ఓ చెక్ బాక్స్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మెయిల్ సెలక్ట్ అవుతాయి. అప్పుడు డిలెట్, ట్రాష్ ఆప్షన్స్ వస్తాయి. ఆ రెండింట్లో ఏదైనా ఆప్షన్ సెలక్ట్ చేసుకుంటే ఒకేసారి మల్టిపుల్ మెయిల్స్ డిలెట్ చేసుకోవచ్చు. దీంతో మీకు స్టోరేజ్ కూడా యాడ్ అవుతుంది. అలా కాకుండా సెలక్ట్ ఆల్ బటన్ పై కూడా క్లిక్ చేయవచ్చు. అప్పుడు అన్నీ మెయిల్స్ సెలక్ట్ అవుతాయి.
ఇలా కాకుండా ఇంకా సింపుల్ గా ఒకేసారి బల్క్ మెయిల్ డిలెట్ చేయాలంటే పర్టికులర్ డేట్ నుంచి డేట్ వరకు సెలక్ట్ చేసుకొని ఆయా డేట్ లో వచ్చిన మెయిల్స్ డిలెట్ చేసుకోవచ్చు. ఇది ఇంకా చాలా సింపుల్ పని.