Parenting Tips: పిల్లలకు ఇవి నేర్పండి చాలు.. జెమ్స్ అయిపోతారు..

Parenting Tips: పిల్లలకు ఇవి నేర్పండి చాలు.. జెమ్స్ అయిపోతారు..

పిల్లలకు ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా టీవీ చూస్తూనో, మొబైల్ ఫోన్లతో ఆడుతూనో ఉంటారు. ఏదైనా పని చెప్తే పట్టించుకోనట్లు వ్యవహరిస్తారు. ఈ కారణంగా పిల్లలు పనిపై శ్రద్ధ చూపకపోవడం, పెద్ద లను గౌరవించకపోవడం చేస్తుంటారు. మరి అలాంటి పిల్లలకు సరైన అలవాట్లు నేర్పించాలి. వయస్సుకు తగ్గట్టు... పిల్లలకు పనులు నేర్పాలి. చిన్న చిన్న పనులు చేస్తుంటే.. పిల్లలకు ఉత్సాహం వస్తుంది. దీని వల్ల ఇతరులపై ఆధారపడటం మానేస్తారు.

స్కూలు నుంచి ఇంటికి రాగానే షూ విప్పి నేలమీద, కుర్చీల దగ్గర వదిలేయకుండా. వాటిని బయట దులిపి, షూ రాక్లో పెట్టమని చెప్పాలి. సాక్స్ను, స్కూల్ డ్రస్ ని ఉతకాల్సిన బట్టలున్న బకెట్ లేదా టబ్లో వేయమని చెప్పాలి. టిఫిన్ బాక్సు, పాలు తాగిన గ్లాస్ వంటింటి సింక్ లో పెట్టమనాలి.

ALSO READ : Health Alert : ముఖ్యంపై నల్ల మచ్చలు ఎందుకొస్తాయి.. ట్రీట్ మెంట్ ఏంటీ.. నల్లమచ్చలు రాకుండా ఈ జాగ్రత్తలు.. !

సెలవు రోజు పిల్లల కోసం కేటాయించిన అల్మరాలోని పుస్తకాలను, బట్టలను, ఆట సామగ్రిని సర్దుకోమని చెప్పాలి. పిల్లలు తల్లికి ఆసరాగా ఉంటే, పనుల ఒత్తిడి తగ్గుతుంది. పిల్లల్లో ఐకమత్యం, ఎదుటివారి శ్రమను గుర్తించే మనస్తత్వం అలవడుతుంది. సమయం విలువ తెలుస్తుంది.

== V6 వెలుగు లైఫ్