పండ్లు... ఆరోగ్యానికి చాలా మంచిది. ఫ్రూట్స్ తింటే వ్యాధి నిరోధక శక్తి పెరిగి వ్యాధులు దరిచేరవని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది వాస్తవం కూడా ... అయితే చాలా మంది పండ్లు తినేటప్పుడు నియమాలు పాటించరు. తినేప్పుడు కొన్ని తప్పులు చేస్తే.. శరీరం దెబ్బతింటుంది. అలా జరగకుండా పండ్లు తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. . . .
◆కొన్ని రకాల పండ్లను ఉప్పుతో కలిపి తింటుంటాం... ఇలా చేయడం చాలా తప్పు అని నిపుణులు చెబుతున్నారు. వారి అభిప్రాయం ప్రకారం ఉప్పును పండ్లతో కలపడం వల్ల దాని నుండి నీరు బయటకు వస్తుంది. ఈ నీటితో పాటు పండులోని పోషకాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. అందుకే ఉప్పు కలపకుండా పండ్లు తినడం చాలా మంచిది. ఒక్కోసారి అప్పుడే పండును కట్ చేసుకుని ఉప్పు అడ్డు కుని అప్పటికప్పుడు తింటుంటారు. ఇలా చేస్తే కొద్దిగా ఫరవాలేదు కానీ పండ్లకు ఉప్పు కలిపి అట్టే పెట్టకూడదు..
◆పండ్లను కోసిన తర్వాత ఎప్పుడూ నీటితో కడగకూడదు. పండుతో పాటు తోలు కూడా అనేక పోషకాలను కలిగి ఉంటుంది. పండును కోసిన తర్వాతనీటితో కడిగితే పోషకాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. అందుకే కత్తిరించే ముందే పండ్లను బాగా కడగాలి. అలాగే పండ్లను తినేముందు మాత్రమే కట్ చేయాలి. ముందే కట్ చేయడం వల్ల కూడా ఈగలు అవీ వాలి బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంది.
◆చాలామంది పండ్లతో పాటు ఇతర ఆహారాలను కలిపి తింటుంటారు. ఇది చాలా తప్పని చెబుతున్నారు నిపుణులు. భోజనం చేసిన వెంటనే పండ్లను తింటుంటారు కొందరు. ఇది శరీరానికి అస్సలు మంచిది కాదు. ఇది శరీరంలో విషపూరితమైన, హానికరమైన పదార్ధాలను ఉత్పత్తి చేస్తుంది. పండ్లను ఎప్పుడూ విడిగానే తినాలి. భోజనం చేసిన వెంటనే తినొద్దు.
◆రాత్రి ఆహారం తిన్న తర్వాత.. చాలా మంది పండ్లను తింటారు.. ఇది అస్సలు మంచిది కాదు. దీనివల్ల శరీరానికి హాని కలుగు తుంది. సూర్యాస్తమయం తర్వాత పండు తినకూడదని పెద్దలు చెబుతారు. నిపుణులు కూడా అదే చెబుతున్నారు.
◆పండ్లు తిన్న తర్వాత మంచినీళ్లు అస్సలు తాగకూడదు అం టున్నారు నిపుణులు. పండు తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అంతేకాకుండా, పీహెచ్ స్థాయిల సమతుల్యత చెదిరిపోతుంది.