ప్రేమికుల దినోత్సవం : స్పెషల్ ట్రీట్ ఇలా ప్లాన్ చేసుకోండి.. జీవితాంతం గుర్తుండేలా.. !

ప్రేమికుల దినోత్సవం : స్పెషల్ ట్రీట్ ఇలా ప్లాన్ చేసుకోండి.. జీవితాంతం గుర్తుండేలా.. !

వాలెంటైన్స్ డే.. అనగానే అంతా తమ ప్రేమను ప్రియుడు లేదంటే ప్రియురాలితో పంచుకుంటారు. గిఫ్టులు, గ్రీటింగ్ కార్డులు, సినిమాలు.. ఇలా ఒకటేమిటి బోలెడన్ని ప్లాన్స్ వేసుకుంటారు. ప్రేమను తెలిపేందుకు ఎన్నో వెరైటీ గిఫ్ట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రియమైనవాళ్లు జీవితాంతం గుర్తుండిపోయేలా ఇచ్చే బహుమతులను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే.. వాళ్ల మనసు దోచుకోవచ్చు.

ప్రేమికుల రోజన ప్రియమైన వాళ్లకి ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది' అని తెగ ఆలోచించేస్తాం. బోలెడన్ని షాపులు తిరిగేస్తాం. ఇది అందరూ చేసే పనే. ఇంతకీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇచ్చే ప్రేమ గిఫ్ట్ ల లిస్టులో ఫస్ట్ ప్లేస్ నగలదే! ఆ తర్వాత గ్రీటింగ్ కార్డులు, చాక్లెట్లు, పువ్వులను ఎక్కువ మంది ఇచ్చి పుచ్చుకుంటున్నారు. మన దేశంలో కూడా ఈ బహుమతుల లిస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక, గిఫ్ట్ ఏదైనాకానీ.. అందులో ప్రేమను ప్రతిబింబించే హార్ట్' షేప్ తప్పసరి అని ఒక సర్వే ద్వారా తెలిసింది.

Also Read :- ప్రేమికులు పార్టీకి వెళుతున్నారా.. ఇలా రెడీ అవ్వండి

ప్రేమికుల రోజున నూటికి తొంభై మంది ఇచ్చే బహుమతుల్లో తప్పనిసరిగా ఉండేవి ఏమిటో తెలుసా? పువ్వులు.. ప్రత్యేకించి ప్రేమకు గుర్తుగా భావించే గులాబీలు, వాటితో పాటు వేరే గిఫ్ట్ లు కూడా చాలామంది ఇస్తుంటారు. అయితే, ఈసారి వాటిని మించిన గిఫ్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. హార్ట్ షేప్ బొమ్మలాంటివి ఇప్పుడు బాగా ఓల్డ్ ఫ్యాషన్ అయ్యాయి. కాబట్టి కొత్తగా ఏదైనా ట్రై చేసి.. మీ పార్ట్నర్ని సర్ప్రైజ్ చేయండి.

వండి.. వడ్డించండి

అమ్మాయి, అబ్బాయి కలిసి రెస్టారెంట్లకు వెళ్లడం ఇప్పుడు మామూలే. ఇలా చేస్తే వాలెంటైన్స్ డేకి, మామూలు రోజుకి తేడా ఏముంటుంది. అందుకే స్వయంగా వండి మీ పార్ట్నర్ కు వట్టించండి. ఇది ఇద్దరికీ ఎంతో స్పెషల్ అకేషన్ అవుతుంది.

ఇష్టాఇష్టాలు కనిపెట్టండి

ఇచ్చే బహుమతి మీ అభిరుచిని, దాన్ని అందుకునేవాళ్ల అభిరుచికి తగినట్టుగా ఉండాలి. అంతేకాని స్థాయికి మించి ఖర్చు పెట్టాల్సిన పని లేదు. నిజమైన ప్రేమకు విలువైన వస్తువుకు సంబంధం లేదు.. ఒక్కోసారి మీ పార్ట్నర్ మాట్లాడే మాటల్లోనే కొన్ని ఐడియాలు దొరకొచ్చు. ‘‘ఫలానా షాష్ లో ఆ వస్తువులు బాగుంటాయి..",  "మనం ఎప్పుడూ ఆ రెస్టారెంట్ కి వెళ్లలేదు కదా..’’ ఇలాంటి మాటల్లో వాళ్ల ఆసక్తిని మీరు తెలుసుకోవచ్చు. దాని ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు.

అదే మంచి జ్ఞాపకం

ఈ మధ్యే ప్రేమ మొదలై ఉంటే ఒక చిన్న మొక్కను బహుమతిగా ఇవ్వడం మంచి ఐడియా. ఆ మొక్కలా మీ రిలేషన్షిన్ రోజురోజుకూ పెరుగుతూ ఉంటుంది. ఆ మొక్కను శ్రద్ధ పెట్టి పెంచితే మీ పార్ట్నర్ పై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. అలాగే మీ అనుబంధం వివాహ బంధంగా మారితే చిన్న మొక్క చెట్టుగా మారి తియ్యటి జ్ఞాపకం అవుతుంది.

ట్రెండీ హార్ట్స్

వాలెంటైన్స్ డే కోసం ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ మెలొర్రా 'ట్రెండీ హార్ట్స్' పేరుతో కొత్త కలెక్షన్ విడుదల చేసింది. డిస్కో సీక్వెన్స్, వైఫ్ ప్లీట్స్, ఫవర్ బొకే, యానిమల్ ప్రింట్, బౌస్ అండ్ నియోన్ లాంటి ఎన్నో వెరైటీలు ఈ కలెక్షన్ లలో ఉన్నాయి. అదేవిధంగా జోయ్ అలుకాస్ ‘బీ లైన్' పేరుతో సరికొత్త కలెక్షన్ ను లాంచ్ చేయగా, మలబార్ గోల్డ్ వాలెంటైన్స్ కలెక్షన్ పై స్పెషల్ ఆఫర్స్ అందిస్తోంది. తమ ఇష్టమైన వాళ్లకు గుర్తుండిపోయేలా అందమైన బహుమతిని ఇవ్వాలనుకునే అబ్బాయిలను ఇవి బాగా ఆకట్టుకుంటాయి.

నామీద నీకున్న ప్రేమ ఎంత..." అని క్యూట్ గా అడిగిన ప్రియురాలికి చెప్పలేనంత అంటూ కొంటెగా సమాధానం చెబుతుంటారు అబ్బాయిలు. ప్రేమను కొలిచి చెప్పడం కష్టమే మరి. కానీ తమ ప్రేమ బంధం ఎంత దృఢమైనదో తెలుసుకోవాలని సరదా పడుతుంటారు ప్రేమికులు. అలాంటి వాళ్లకోసమే 'లవ్ క్యాలిక్యులేటర్' పేరుతో ఎన్నో వెబ్సైట్స్ ఉన్నాయి. వాటిలో పూర్తి పేర్లను టైప్ చేస్తే వాళ్ల ప్రేమ ఎంతశాతం దృఢమైందో తెలిపే వివరాలొస్తాయి. సంఖ్యాశాస్త్రం ఆధారంగా పేర్లను బట్టి ప్రేమను తెలుపుతాయన్నమాట, ఇవి ఎంతవరకూ నిజమో కానీ సరదాగా చూసుకోవడానికి బాగుంటాయి.

అతి వద్దు

వాలెంటైన్స్ డే గ్రీటింగ్ కార్డులు మార్కెట్లో గుట్టలు గుట్టలుగా దొరుకుతాయి. వాటిలో ఉండే కొటేషన్లు కూడా బాగుంటాయి కానీ, అవి మీ సొంత పీలింగ్స్ కావు కదా. కాబట్టి మీరేం అనుకుంటున్నారో పేపర్ మీద పెట్టి గ్రీటింగ్ తయారు చేసి ఇవ్వండి. అయితే, అతిగా ఇంప్రెస్ చెయ్యడానికి లేనిపోనివి రాయొద్దు. ప్రేమలో నిజాయతీగా ఉండటం ముఖ్యమని గుర్తుపెట్టుకోవాలి. మీ గిఫ్ట్ ముఖ్యంగా గర్ల్ ఫ్రెండ్స్ కు ఇచ్చే వైతే.. వాళ్లు అవమానపడేలా, సిగ్గుపడేలా, బాధపడేలా ఉండకూడదు.