పేమెంట్స్ యాప్స్ వంటి కొన్ని యాప్స్ పబ్లిక్‌గా పెట్టుకోవడం కొందరికి నచ్చకపోవచ్చు. అందుకే హైడింగ్ యాప్ అనే ఆప్షన్ ఉంది. ఏ ఆండ్రాయిడ్ డివైజ్‌లో అయినా ప్రైవసీ మెయింటెయిన్ చేయడం బెటర్. కాబట్టి పబ్లిక్‌కి కనపడకుండా ఉంచాలనుకునే యాప్స్‌ని హైడ్ చేసుకోవచ్చు. యాప్స్ హైడ్ చేసుకోవడానికి ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్స్ బిల్ట్ – ఇన్ టూల్ ఉంటుంది. శాంసంగ్, పోకో, రియల్ మీ, షావోమీ ఫోన్లు ఉంటే లాంచెర్స్ సెట్టింగ్స్‌కు వెళ్లి ఆప్షన్ వెతకాలి. ఆ ఆప్షన్ పేరు డయలర్. షావోమీ డివైజ్‌లో మాత్రం ‘హైడింగ్ యాప్స్’ అని ఉంటుంది.
- ఆండ్రాయిడ్ ఫోన్ లేదా టాబ్లెట్ కాకపోతే అందులో బిల్ట్ – ఇన్ ఆప్షన్ ఉండదు. అలాంటప్పుడు థర్డ్ పార్టీ లాంచర్స్ అయిన నోవా, అపెక్స్, మైక్రోసాఫ్ట్ లాంచర్ వాడాలి. ఈ లాంచర్స్ ద్వారా హోమ్ స్క్రీన్ మీద ఉన్న యాప్స్ వెంటనే హైడ్ అవుతాయి. ఒకవేళ హైడ్ చేయడం ఎందుకు? అనుకుంటే.. థర్డ్ పార్టీ లాంచర్స్ ద్వారా యాప్ ఐకాన్, పేరు మార్చి వాడొచ్చు.
- యాప్స్ ఎక్కువ కనపడకూడదు అనుకుంటే ఫోల్డర్లో వేయొచ్చు. ఇది చాలా ఈజీ మెథడ్. మరొక పద్ధతి.. థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా సెక్యూర్ అథెంటికేషన్ మెకానిజం వాడొచ్చు. ఫింగర్ ప్రింట్, పాస్వర్డ్, ప్యాటర్న్, పిన్ వంటివి. విండోస్లాగానే మ్యాక్ – పవర్డ్ పీసీలు, ఆండ్రాయిడ్ డివైజ్‌లు ఎక్కువ యూజర్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయొచ్చు.