
సమ్మర్ మొదలైంది.. ఎండలు మండుతున్నాయి.. కూల్ కూల్‌గా పొట్టలో ఏదో ఒకటి పడేయాలనుకుంటాం. అందుకే ఈ సీజన్‌లో పుచ్చకాయ ( Water melon) కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అయితే వ్యాపారస్తులు రంగు రావడానికి రసాయనాలను ఉపయోగిస్తుంటారు.. రుచికి రుచి.. ఆరోగ్యానికి .. ఆరోగ్యం..ఇచ్చే పుచ్చకాయ ... కల్తీ అయిందా.. ఆరోగ్యం మాట కాస్త పక్కన బెడితే అనారోగ్యం కంపల్సరీ.. మరి రసాయనాలు లేని పుచ్చకాయను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. .
వేసవి దగ్గరకు వచ్చింది. ఈ సీజన్‌లో ఎక్కువ డిమాండ్ ఉండేది పుచ్చకాయలకు. అయితే వీటికి రంగు రావడానికి కొన్ని రసాయనాలు కలుపుతూ ఉంటారు. వాటిని గుర్తించాలి. ఇలాంటి పుచ్చకాయ తింటే ఆరోగ్యమేమో కాని... అనారోగ్యం మాత్రం తప్పక వస్తుంది. . .
పుచ్చకాయ లోపల ఉండే ఎర్రటి గుజ్జు తియ్యటి రుచితో ఉండి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాటర్ మిలాన్ గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్‌ల నుండి రక్షణ కలిగిస్తుంది. అందుకే కల్తీ లేని పుచ్చకాయను తినాలి. పుచ్చకాయను కోసి ఇంటికి తీసుకెళ్లేలోపు పాడయిపోయే అవకాశం ఉంది.
పుచ్చకాయను ఇంగ్లీషులో వాటర్‌మిలన్ (Watermelon) అంటారు . అంటే దీనిలో పేరుకు తగినట్లుగా 91 శాతం నీరే ఉంటుంది. కాబట్టి ఈ పండు వేసవిలో తినడం చాలా మంచిది. ఇందులో కేలరీలు తక్కువ ఉంటాయి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి పుచ్చకాయ తింటే కడుపు నిండుతుంది, దాహం తీరుతుంది, మంచి పోషకాలు శరీరానికి అందుతాయి
బరువున్న పుచ్చకాయ: పుచ్చకాయను కొనేటప్పుడు బరువును పరిశీలించాలి. దానిని పట్టుకుంటే బరువుగా ఉండాలి. బరువుగల వాటర్ మిలాన్ మాత్రమే పండుతుంది. రసాయనాలతో పండించిన పుచ్చకాయ చాలా తేలికగా ఉంటుంది. ఎంత బరువు ఉంటే అంత ఎక్కువుగా నీరు.. ఎర్రటి గుజ్జు ఉంటుంది. కాబట్టి పుచ్చకాయను బరువుగా ఉంటే తీసుకోండి.
చేతితో తట్టి చూడండి: పండిన పుచ్చకాయను చేతితో తట్టినప్పుడు సౌండ్ బాగా వస్తుంది. తోలు మందంగా ఉంటుంది. పుచ్చకాయ పండితే చేతితో తట్టినప్పుడు బోలు శబ్దం వస్తుంది.
పుచ్చకాయ ఆకారం: వివిధ రకాలైన.. వివిధ రకాలైన పరిమాణాలతో పుచ్చకాయలను మార్కెట్లో అమ్ముతుంటారు. కొన్ని గుండ్రంగా ఉంటాయి.. మరికొన్ని కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి. ఎలా ఉన్నా పరవాలేదు కాని ఒకే ఆకారంలో ఉన్న వాటర్ మిలాన్ తీసుకోవాలి. ఎక్కువ తక్కువలు ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే కచ్చితంగా రసాయనాలతో పండించినట్లేనని గుర్తించాలి.
పసుపు మచ్చలు ఉండాలి: వాటర్ మిలాన్ కొనేటప్పుడు అన్నివైపులా తిప్పి చూస్తే, దానిపై పసుపు రంగు మచ్చ కనిపించాలి. తీగపైనే పుచ్చకాయ పక్వానికి వస్తే దానిపై పసుపు మచ్చలు ఉంటాయి. అంతేకాదు అలాంటి పండు చాలా తియ్యగా ఉంటుంది. ఫీల్డ్ స్పాట్ లేదా గ్రౌండ్ స్పాట్ అని కూడా పిలుస్తారు. అదే రసాయనాలతో పండిస్తే తెల్లటి మచ్చలు ఉండి .. జ్యూస్ తక్కువగా ఉండటమే కాకుండా .. రుచి చప్పగా ఉంటుంది.
రంధ్రాలు గమనించండి: పుచ్చకాయను .. కాయ మాదిరిగానే కొనాలి.. ముక్కలు చేసిన కాయను కొనకూడదు. కొంతమంది వ్యాపారులు పుచ్చకాయను పండించడానికి సూదితో ఇంజెక్షన్లు చేస్తారు. కాబట్టి అలాంటి రంధ్రాలు ఉన్నాయోమో గమనించి, రంధ్రాలు లేని పండును తీసుకోండి.
శరీరంపై దుష్ప్రభావాలు: రసాయనాలతో (కార్బైడ్‌తో ) చేసిన పండ్లను తినడం వల్ల కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది. మిథనాల్ కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. క్రోమేట్ కడుపు సమస్యలు, రక్తహీనత, మెదడు దెబ్బతినడం, సంతానోత్పత్తి తగ్గడం వంటి సమస్యలను కలిగిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లను తింటాం. కానీ మనం తినే పండ్లు శరీరానికి హాని కలిగించే అవకాశం ఉంది. ఎందుకంటే లాభం కోసం పండ్లపై రసాయనాలు వాడుతున్నారు. రసాయన రహిత పండ్లు తినడం మాత్రమే ఆరోగ్యానికి మంచిది.
పసుపు మచ్చలుండే, గట్టి ( బరువు) పుచ్చకాయను ఎంచుకొని, తొడిమ ప్రాంతం ఎండిందో లేదో చూసి కొనుక్కోండి. అప్పుడు దాన్ని కట్ చెయ్యకపోయినా లోపల ఎర్రగానే ఉంటుందని పరిశోధకులు తేల్చారు. కట్ చెయ్యని పుచ్చకాయని ఇంట్లో (ఫ్రిజ్‌లో లేదా ఎండ తగలని చోట) ఓ రెండ్రోజులు ఉంచినా పాడవదు.కాబట్టి పుచ్చకాయ కొనేటప్పుడు పైన చెప్పిన విషయాలను గుర్తుంచుకోండి.