ఫేక్ మెసేజ్‌లు వస్తున్నాయా? వాటిని ఇలా గుర్తించండి..

  • కస్టమర్లకు అవగాహన కల్పిస్తోన్న ఐసీఐసీఐ బ్యాంక్
  • మూడు రకాలుగా ఫేక్ మెసేజ్‌‌లు
  • ఈ టిప్స్ పాటించాలంటూ కస్టమర్లకు సూచన

న్యూఢిల్లీ: ఇటీవల ఆన్‌‌లైన్ బ్యాంకింగ్ మోసాలు బాగా పెరుగుతున్నాయి. బ్యాంక్‌‌లు వివిధ మీడియా ఛానల్స్ ద్వారా ఎంత అవగాహన కల్పించినప్పటికీ బ్యాంకింగ్ మోసాలు మాత్రం ఆగడం లేదు. అయితే ఈ మోసాలు పెరగడానికి ప్రధాన కారణం ఫేక్ మెసేజ్‌‌లను గుర్తించలేకపోవడమేనని ఐసీఐసీఐ బ్యాంక్ కనుగొంది. బ్యాంకింగ్ ఫ్రాడ్స్ బారిన పడకుండా ఉండటానికి మూడు రకాల టిప్స్‌‌ను పాటించాలని ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు ఈమెయిల్ చేస్తోంది. మోసగాళ్లు ఎక్కువగా మూడు రకాల మోసపూరిత మెసేజ్‌‌లను పంపుతున్నట్టు బ్యాంక్ కనుగొంది. వాటిని ప్రజలకు తెలిపింది.

ఆ మెసేజ్‌‌లు ఏమిటో ఓసారి చూద్దాం…

బీపీ-బీన్‌‌వైటీఎం నుంచి వచ్చే ఫేక్ మెసేజ్..

మీ కేవైసీ విజయవంతంగా అప్‌‌డేట్ అయింది. ఇప్పుడు మీరు రూ.1,300 క్యాష్‌‌బ్యాక్‌‌ను క్లయిమ్ చేసుకునేందుకు అర్హులు. క్యాష్‌‌బ్యాక్‌‌ను క్లయిమ్ చేసుకునేందుకు విజిట్, http://311agtr అని వస్తాయి..

ఐసీఐసీఐ బ్యాంక్ సూచన..

కేవైసీ ఎలాంటి రివార్డులను పొందదు. ఇది స్పష్టంగా తెలుస్తోంది ఫేక్ మెసేజ్అని. పైన ఉన్న లింక్ కూడా ఫేక్.

వై-క్యాష్ నుంచి వచ్చే ఫేక్ మెసేజ్…

కంగ్రాచ్యులేషన్స్, మీ అకౌంట్‌‌లోకి రూ.3,30,000  క్రెడిట్ అయ్యాయి. ఈ అమౌంట్ ప్రాసెస్ అయ్యేందుకు మీ వివరాలు http://i2urewards.cc/33 లో నమోదు చేయండి అని వస్తుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ సూచన..

ఏ కంపెనీ కూడా ఇంత పెద్ద మొత్తంలో క్యాష్‌‌ను ఊరికినే వేయదు. పైన వచ్చిన లింక్ పూర్తిగా ఫేక్.

8726112@vz.com నుంచి వచ్చే మెసేజ్‌‌…

మీ ఐటీ రీఫండ్ ప్రాసెస్ ప్రారంభమైంది. దీన్ని క్లయిమ్ చేసుకోవడానికి ఈరోజే చివరితేది. విజిట్ http://itr.trn./toref అని వస్తుంది..

ఐసీఐసీఐ బ్యాంక్..

‘సెండర్ ఐడీ చూస్తేనే మీకు అర్థమవుతుంది. అది ఫేక్ మెసేజ్ అని’ అని బ్యాంక్ పేర్కొంది.  అకౌంట్ హోల్డర్స్ తమకు వచ్చే మెసేజ్‌‌లను చాలా కేర్‌‌‌‌ఫుల్‌‌గా చదవాలని ఐసీఐసీఐ బ్యాంక్ హెచ్చరించింది. పైన చెప్పిన ఇండికేటర్స్‌‌ను గుర్తుంచుకోవాలని పేర్కొంది.

For More News..

బైడెన్ రాకతో మనోళ్లకు మంచి కబురు

భర్తను చంపి అడవిలో పూడ్చిన భార్య

రాత్రికిరాత్రే వందల శిలాఫలకాలు.. పొద్దుగాల్నె శంకుస్థాపనలు