స్మార్ట్ఫోన్ బ్యాటరీ లైఫ్ సామర్థ్యం పెరగాలంటే..ఇలా చేయండి

స్మార్ట్ఫోన్ బ్యాటరీ  లైఫ్ సామర్థ్యం పెరగాలంటే..ఇలా చేయండి

మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ త్వరగా  లో అవుతుందా..?  ముఖ్యమైన సమయంలో స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోతుందా..? ఏం పర్లేదు..మేము చెప్పే సూచనలు పాటిస్తే..మీ మొబైల్ బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఈ ఐదు మార్గాలను పాటిస్తే మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. 

తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో వాడొద్దు..

స్మార్ట్ ఫోన్ లోని బ్యాటరీ లైఫ్ తగ్గిపోవడానికి కారణం అతివేడిలో వాడటం..మరీ చల్లటి వాతావరణంలో ఉపయోగించడం.  కాబట్టి స్మార్ట్ ఫోన్ ను వెరీ హాట్..వెరీ కూల్ వాతావరణంలో వాడకండి. ఎక్కువ టెంపరేచర్ , అతి తక్కువ టెంపరేచర్  వల్ల ఫోన్ బ్యాటరీ సామర్థ్యం దెబ్బ తింటుంది. వేడిలో ఉపయోగిస్తే పర్ఫామెన్స్ తగ్గిపోతుంది. అతి చలిలో ఉపయోగిస్తే బ్యాటరీ లైఫ్ పడిపోతుంది. 

ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ కవర్లు తీసేయాలి..

మీ స్మార్ట్ ఫోన్ ను చార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ బ్యాక్ కవర్లను తొలగించాలి. ఇవి ఉంటే ఫోన్  వేడి బయటకు వెళ్లకుండా ఆపుతాయి. దీని వల్ల ఫోన్ మరింత వేడెక్కుతుంది. దీని కారణంగా ఛార్జింగ్ ప్రక్రియ సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది. చివరికి ఫోన్ బ్యాటరీని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగిస్తుంటే... ఛార్జింగ్ పెట్టే ముందు ఫోన్ బ్యాక్ కవర్ ను తొలగిస్తే మంచిది. 

 ఛార్జింగ్‌ ఆప్టిమైజ్డ్‌ చేయండి..

ALSO READ : బోణీ అయ్యింది : హైదరాబాద్ లో ఓటర్లకు పంచే కుక్కర్లు పట్టివేత

చాలా మంది వినియోగదారులు...రాత్రి వేళల్లో  ఛార్జింగ్‌ పెట్టి అలాగే వదిలేసి పడుకుంటారు. దీని వల్ల బ్యాటరీ దెబ్బతింటుంది. అలా కాకుండా ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ ఆప్టిమైజేషన్ సెట్టింగ్ ఆన్ చేస్తే మంచిది. చార్జింగ్ ఆప్టిమైజేషన్ ఆన్ చేస్తే.. ఫోన్ బ్యాటరీని 80 శాతం కంటే ఎక్కువ ఛార్జ్ కాకుండా చేస్తుంది. ఇది ఆన్ చేయడం వల్ల  ఫోన్ బ్యాటరీ  లైఫ్ పెరుగుతుంది.  బ్యాటరీని 100 శాతం ఛార్జ్ చేయొద్దు..దీని వల్ల బ్యాటరీ సామర్థ్యం క్షీణిస్తుంది.  80శాతం మాత్రమే ఫోన్  ఛార్జ్ చేస్తే.. అది ఎక్కువ కాలం బ్యాటరీ వస్తుంది. 

 లో  బ్యాటరీ ఉన్నప్పుడు ఫోన్ వాడకండి..

మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ  లో అయినప్పుడు..అంటే 25 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు వాడొద్దు. దీని వల్ల బ్యాటరీ దెబ్బతింటుంది. బ్యాటరీ లైఫ్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఫోన్ బ్యాటరీ పర్సంటేజ్ 25 శాతం నుంచి 80 శాతం మధ్యలో ఉండేలా చూసుకోవడం మంచిది. 

స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ను పెంచుకునేందుకు ఈ  చిట్కాలు పాటించండి

మీరు స్మార్ట్ ఫోన్ ను ఉపయోగిస్తున్నప్పుడు..5జీ స్పీడ్ అవసరం లేకుంటే 4G LTE వాడండి.  4G LTE కంటే 5G ఎక్కువ బ్యాటరీ పవర్‌ను ఉపయోగిస్తుంది. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, రిజల్యూషన్‌ను తగ్గించండి. దీని వల్ల ఎక్కువ బ్యాటరీ శక్తిని ఖర్చు చేస్తాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్కువ బ్యాటరీని లాగేసే యాప్‌లను గుర్తించాలి.  ఏ యాప్‌లు ఎక్కువ బ్యాటరీని ఉపయోగిస్తున్నాయో చూడటానికి ఫోన్ బ్యాటరీ కన్సెప్షన్ సెట్టింగ్స్‌ చెక్ చేసుకోండి. వాటికి పర్మిషన్స్ ఆపేయండి.