Good Health: క్యారెట్..ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే..ఈ చిన్న పని చేస్తే చాలు..!

Good Health: క్యారెట్..ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే..ఈ చిన్న పని చేస్తే చాలు..!

వంటింట్లో ప్రధానమైన కూరగాయల్లో క్యారెట్ ఒకటి. క్యారట్ లో ఎన్నో పోషకాలు, ఆరోగ్యకరమైన లాభాలు ఉండటమే ఇందుకు కారణం..వంటింట్లో క్యారట్ ఉండని ఇల్లంటూ ఉండదు. మరి అలాంటి విలువైన క్యారట్ ను నిల్వ చేయడంలో ఓ పద్దతి అంటూ లేకపోతే ఎక్కువ కాలం తాజాగా ఉండవు. దీంతో మనకు లభించే పోషకాలు, ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ ను కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి.. క్యారట్ ను ఎక్కువ కాలం నిల్వ ఉంచే విధంగా ఎలా నిల్వ చేయాలో తెలుసుకుందాం.. 

 గాలి చొరబడిన బ్యాగ్ లో ఉంచడం ద్వారా.. 

క్యారెట్లను గాలి చొరబడిన బ్యాగ్ లో ఉంచితే.. తాజాగా, రుచి అలాగే ఉంటుంది. ఈ పద్దతిలో క్యారట్ లోని తేమ లాక్ చేయబడుతుంది. క్యారెట్లు ఎండిపోకుండా ఉంచుతుంది. చాలా మంది ఫ్రిజ్ లో వదులుగా నిల్వ ఉంచుతారు.. దీని వల్ల ఎక్కువకాలం తాజాగా ఉండవు..తేమ కోల్పోయి, తెల్లని మచ్చలు ఏర్పడతాయి. 

క్యారెట్లను నిల్వం ఉంచే ముందు కట్ చేయడం లేదా తుంచడం చేయొద్దు 

ఈ పద్దతిలో పొట్టు తీయని క్యారెట్  లేదా తుంచని క్యారెట్ తేమను నిలుపుకుంటుంది.తాజాగా ఉండాలంటే తినే ముందు మాత్రమే కట్ చేయాలి. కట్ చేయాల్సి వస్తే గాలి చొరబడిన కంటైనర్ లో ముక్కలు ఉంచాలి.  

బ్యాగ్ లో ఉంచేముందు తడి ఉన్న కాగితాన్ని చుట్టి.. 

క్యారెట్లు మరింత తాజాగా ఉండాలంటే.. గాలి చొరబడని బ్యాగ్ లో పేపర్ టవర్ ను చుట్టి ఉంచాలి. దీంతో క్యారెట్లు తేమ ఎండిపోకుండా , క్రంచ్ కోల్పోకుండా ఉంటాయి. ఈట్రిక్ ద్వారా క్యారెట్లను 4 వారాలపాటు తాజాగా ఉంచొచ్చు. 

క్యారెట్లను డీప్ ఫ్రిజ్ లో ఉంచితే.. 

క్యారెట్లు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద వృద్ది చెందుతాయి కాబట్టి ఫ్రిజ్ లోని డీప్ ఫ్రిజ్ (క్రిస్పర్ డ్రాయర్) లో లేదా వెనకభాగంలో నిల్వ చేయాలి. ఇక్కడా ఫ్రిజ్ మొత్తంలో చల్లగా ఉంటుంది. ఈ ప్రదేశంలో గాలిచొరబడని బ్యాగ్ లో క్యారెట్లను ఉంచితే 3నుంచి 4 వారాల వరకు తాజాగా ఉంటాయి. 

ఇథిలిన్ ఉత్పత్తి చేసే పండ్లకు క్యారెట్లను దూరం ఉంచాలి 

యాపిల్స్, అరటిపండ్లు, టొమాటో వంటి పండ్ల ద్వారా ఇథిలీన్ వాయువకు ఉత్పత్తి అవుతుంది. వీటిని క్యారట్ తో ఉంచితే తొందరగా పాడైపోతుంది. క్యారెట్లను తాజాగా ఉండాలంటే.. వాటికి దూరంగా ఉంచాలి. 

ALSO READ | Good Health : బ్రేక్ ఫాస్ట్ ఎంత తినాలి.. హెవీగా తినాలా.. మీడియంగానా.. లైట్ గానా.. ఏది బెటర్ అంటే..?

ఇలా క్యారెట్లను ఫ్రెష్ గా ఉంచుకోవాలంటే.. గాలి చొరబడని బ్యాగ్ లో నిల్వ చేయాలి. ఫ్రిజ్ లో వదులుగా ఉంచడం కంటే ఈవిధానం ద్వారా రెట్టింపు లేదా మూడు రెట్ల ఎక్కువ రెట్లు తాజాగా ఉంచొచ్చు. ఈచిట్కాలను అనుసరించి ఒక నెల వరకు తాజా, క్రంచీ క్యారెట్లను తినొచ్చు.