
- రంగారెడ్డి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ అదేశాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి డివిజన్ లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పై నిఘా పెట్టాలని డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ సూచిం చారు. గురువారం అబ్కారీ భవన్‌లో ఎక్సైజ్ అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను అరికట్టనప్పుడే ఎక్సైజ్ లిక్కర్ అమ్మకాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్‌తో పాటు గంజాయి, డ్రగ్స్ అమ్మకాలపై కూడా నిఘా పెంచాలన్నారు. వీటితోపాటు స్టేషన్లలో , పలు కేసుల్లో నిల్వ ఉన్న గంజాయి, డ్రగ్స్‌ను వెంటనే డిస్పోజల్ కమిటీ అనుమతి తీసుకొని, కాల్చేయాలని పట్టుబడ్డ వాహనాలకు వేలం వేయాలన్నారు. జనవరిలో 197 కేసుల్లో 149 మందిని అరెస్టు చేయడం, 7904 కేజీల బెల్లం, 40 కేజీల అలం, 81.72 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.