![అటుకుల బతుకమ్మ ప్రసాదం](https://static.v6velugu.com/uploads/2021/10/How-to-make-Atukula-Bathukamma-Prasad_BKPwtSkHs3.jpg)
అటుకుల బతుకమ్మ ప్రసాదం
కావాల్సినవి: అటుకులు - ఒక కప్పు, బెల్లం - ముప్పావు కప్పు,
డ్రై ఫ్రూట్స్ - కొద్దిగా , నెయ్యి- కొద్దిగా
తయారీ: కడాయిలో నెయ్యి కరిగించి డ్రై ఫ్రూట్స్ వేగించాలి. అదే కడాయిలో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి బెల్లం కరిగించాలి. అటుకులను నీళ్లలో తడిపి బెల్లం పాకంలో వేసి కలపాలి. చివర్లో డ్రై ఫూట్స్ వేయాలి. ఈ అటుకుల ప్రసాదంతో పాటు చప్పటి పప్పు కూడా నైవేద్యంగా పెడతారు.