కిచెన్ తెలంగాణ : జొన్న ఉప్మా

కిచెన్ తెలంగాణ : జొన్న ఉప్మా

మార్నింగ్​ బ్రేక్​ ఫాస్ట్​ ఇంట్రెస్టింగ్​గా లేకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్​ ఉంటుంది చాలామందికి. ఎప్పుడూ అదే బోరింగ్ ఫుడ్​ అని నసుగుతూనే తింటుంటారు కొందరు. ఇంకొందరేమో టేస్ట్​ ఒక్కటే చూసుకుంటే ఎలా? తినే ఫుడ్​ హెల్దీగా కూడా ఉండాలి అంటారు. ఇలా పొద్దున తినే ఫుడ్​ గురించి రకరకాల అభిరుచులు ఉంటాయి. అందరికీ నచ్చేలా.. ఆరోగ్యాన్నిచ్చేలా బ్రేక్​ ఫాస్ట్ తయారుచేయాలంటే ఈ రెసిపీలు ఫాలో అయిపోండి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ నచ్చేస్తాయి. ఆరోగ్యాన్నీ ఇస్తాయి. 

జొన్న ఉప్మా

కావాల్సినవి :

జొన్నలు – ఒక కప్పు
పల్లీలు – పావు కప్పు
నీళ్లు – రెండున్నర కప్పులు
నెయ్యి – ఒక టేబుల్ స్పూన్
ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, నిమ్మరసం – ఒక్కో టీస్పూన్
జీలకర్ర – అర టీస్పూన్
ఇంగువ – పావు టీస్పూన్
పచ్చిమిర్చి – రెండు
అల్లం తురుము – అర టీస్పూన్
కరివేపాకు – కొంచెం
ఉల్లిగడ్డ, క్యారెట్, క్యాప్సికమ్ – ఒక్కోటి
ఉప్పు – సరిపడా
పసుపు – పావు టీస్పూన్
కొబ్బరి పొడి – పావు కప్పు
నీళ్లు – రెండున్నర కప్పులు

తయారీ : జొన్నల్ని శుభ్రంగా కడిగి, రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. ఆ తర్వాత వడకట్టి, జొన్నల్ని ప్రెజర్​ కుక్కర్​లో వేయాలి. అందులోనే పల్లీలు కూడా వేసి నీళ్లు పోసి మూత పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. పాన్​లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి వేగించాలి. తర్వాత ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి కలపాలి. అవన్నీ వేగాక ఉలిగడ్డ తరుగు వేయాలి. క్యాప్సికమ్​, క్యారెట్ తరుగు కూడా వేసి కలపాలి. మూతపెట్టి రెండు నిమిషాలు ఉడికించాలి. ఆపై పసుపు, ఉడికించిన జొన్నలు, పల్లీలు, ఉప్పు వేసి కలపాలి. మూతపెట్టి మరో రెండు నిమిషాలు ఉడికించాక కొత్తిమీర, కొబ్బరి తురుము, నిమ్మరసం చల్లాలి. అవన్నీ బాగా కలిసేలా కలిపితే జొన్న ఉప్మా రెడీ.