మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ఇంట్రెస్టింగ్గా లేకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది చాలామందికి. ఎప్పుడూ అదే బోరింగ్ ఫుడ్ అని నసుగుతూనే తింటుంటారు కొందరు. ఇంకొందరేమో టేస్ట్ ఒక్కటే చూసుకుంటే ఎలా? తినే ఫుడ్ హెల్దీగా కూడా ఉండాలి అంటారు. ఇలా పొద్దున తినే ఫుడ్ గురించి రకరకాల అభిరుచులు ఉంటాయి. అందరికీ నచ్చేలా.. ఆరోగ్యాన్నిచ్చేలా బ్రేక్ ఫాస్ట్ తయారుచేయాలంటే ఈ రెసిపీలు ఫాలో అయిపోండి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ నచ్చేస్తాయి. ఆరోగ్యాన్నీ ఇస్తాయి.
కొర్ర ఊతప్పం
కావాల్సినవి :
కొర్రలు (ఫాక్స్ టెయిల్ మిల్లెట్) – రెండున్నర కప్పులు
మినప్పప్పు – ఒక కప్పు
ఉప్పు, నూనె – సరిపడా
టొమాటో, ఉల్లిగడ్డ, క్యారెట్ – ఒక్కోటి చొప్పున
కొత్తిమీర తరుగు – కొంచెం
పచ్చిమిర్చి – రెండు
తయారీ : కొర్రల్ని శుభ్రంగా కడిగి, ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. అలాగే మినప్పప్పును కూడా మరో గిన్నెలో వేసి, నీళ్లు పోసి నానబెట్టాలి. తర్వాత వాటిని మిక్సీజార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమంపై మూతపెట్టి ఆరుగంటలపాటు పక్కన పెట్టాలి. ఆ తర్వాత అందులో ఉప్పు వేసి కలపాలి. ఆపై పాన్ వేడి చేసి దోశలా పోయాలి. లేదా దోశ పోశాక దానిపై టొమాటో, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర తరుగు చల్లాలి. లేదంటే దోశ పోయడానికి రెడీ చేసుకున్న మిశ్రమంలో కలిపి, తర్వాత దోశ వేసుకోవచ్చు. మూతపెట్టి రెండు నిమిషాలు ఉడికించాలి. చుట్టూ నూనె వేసి, మెల్లిగా ఊతప్పంను తిరగేసి, రెండో వైపు కూడా కాల్చాలి. కలర్ఫుల్గా కనిపించే ఈ ఊతప్పం.. హెల్దీ బ్రేక్ ఫాస్ట్.