
మిల్లెట్ పాప్సికిల్స్
కావాల్సినవి :
కొర్రలు (ఉడికించి), చాకొలెట్ చిప్స్ – ఒక్కో కప్పు
పాలు – ఒక లీటర్
పీనట్ బటర్ – అర కప్పు
తేనె, పల్లీలు (వేగించి) – ఒక్కోటి పావు కప్పు
వెనీలా ఎసెన్స్, కొబ్బరి నూనె – ఒక్కో టీస్పూన్
తయారీ : పాలు కాగబెట్టి అందులో ఉడికించిన కొర్రలు వేసి కలపాలి. తర్వాత పీనట్ బటర్, తేనె వేసి కలిపి ఐదు నిమిషాలు ఉడికించాలి. వెనీలా ఎసెన్స్, వేగించిన పల్లీలు కూడా ఆ మిశ్రమంలో వేసి కలపాలి. చల్లారాక పేపర్ గ్లాస్లో పోసి అల్యూమినియం ఫాయిల్ పేపర్తో మూసేయాలి. తర్వాత ఆ పేపర్ పై నుంచి ఐస్ పుల్లలు గుచ్చాలి. వాటన్నింటినీ ప్లేట్లో పెట్టి ఫ్రిజ్లో పెట్టాలి. ఎనిమిది గంటల తర్వాత అల్యూమినియం పేపర్, పేపర్ గ్లాస్ తీసేయాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో చాకొలెట్ చిప్స్, నూనె వేడిచేయాలి. చిప్స్ కరిగాక పాప్సికిల్స్ని అందులో ముంచి వేగించిన పల్లీల్లో దొర్లించాలి. చూడటానికి యమ్మీగా ఉండే ఈ మిల్లెట్ పాప్సికిల్స్ తింటే చాలా టేస్టీగా ఉంటాయి.