డాక్టర్.. మావాడు అస్సలు బరువు పెరగడం లేదు. ఎప్పుడు చూసినా జ్వరం, కోల్డ్, దగ్గు, కాసేపు ఆడుకోగానే అలసిపోతాడు. ఎప్పుడు చూసినా నీరసంగా కనిపిస్తాడు. హెల్దీ ఫుడ్ పెడదామంటే తినను అని అడ్డంగా తల ఊపుతాడు. కురుకురేలు, చిప్స్, చాక్లెట్స్ మాత్రం ఇష్టంగా తింటారు. అలాగే ఉంటే ఎలా..? అని అడిగింది సుష్మిత. ఆ పిల్లాడ్ని పరీక్షించిన డాక్టర్ సరైన పోషకాలు అందడం లేదని చెప్పాడు. ముఖ్యంగా ప్రొటీన్స్ ఉన్న ఆహారం తినకపోవడం వల్లే ఎదుగుదల లేదని చెప్పాడు. ఇమ్యూనిటీ తగ్గడం కూడా ఈ సమస్యలకు కారణమన్నాడు.
ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేదని.. అయితే కొన్నిరోజులపాటు తాను దాసిచ్చే ప్రొటీన్ పౌడర్ను వాడాలని చెప్పాడు. డాక్టర్ రాసిచ్చిన ప్రొటీన్ పౌడర్ ఖరీదు 600 రూపాయలు, సరిగ్గా వాడితే వారం రావడం కూడా కష్టమే. అంటే నెలకు దాదాపు రెండున్నరవేలు ఖర్చు, సుష్మిత ఆలోచనలో పడింది. ఈ ప్రొటీన్ పొడ ఇంట్లోనే తయారుచేసుకుంటే ఎంత బాగుండు అనుకుంది..
నిజానికి ప్రొటీన్ పౌడర్ను కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. పైగా ఇంట్లో తయారు చేసుకున్న పౌడర్ మరింత ఆరోగ్యవంతమైనది కూడా. ఎటువంటి కల్తీకి అవకాశమే ఉండదు. బయట కొనే ప్రొటీన్ పౌడర్ అంత ఆరోగ్యవంతమైనది కాకపోవచ్చు. ఎందుకంటే ఎక్కువరోజులు నిల్వ ఉంచడానికి కొన్నిరకాల ప్రిజర్వేటివ్స్ను వాడతారు. ఈ రసాయనాలు ఆరోగ్యానికి హానికరమైనవే. అంతేకాదు ఇంట్లో చేస్తే తక్కువ ఖర్చుతోనే రెడీ అయిపోతుంది. పిల్లల కోసం మనమే చేసుకున్నామన్న సంతృప్తి కూడా ఉంటుంది. అన్నింటికీ మించి అమ్మ చేతి రుచి కూడా దానికి కలుస్తుంది.
మరి ప్రొటీన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామా...
ఏమేం కావాలి: నానా ఫ్యాట్ మిల్క్ పౌడర్: మూడు కప్పులు
బాదం: ఒక కప్పు
బెల్లం/చక్కెర: తగినంత
డ్రై ఓట్స్: ఒక కప్పు
కోకో పౌడర్: ఒక కప్పు (అవసరమనుకుంటే..)
ఎలా తయారు చేయాలి..?
మిక్చర్లో అన్ని పదార్థాలను వేసి మెత్తగా అయ్యేవరకు బ్లెండ్ చేయాలి. ఆతర్వాత అ మిశ్రమాన్ని శుభ్రమైన జార్లో భద్రపర్చుకోవాలి. మీరు ఎక్కువకాలం ఉంచాలనుకుంటే దాన్ని ఫ్రిజ్లో భద్రపరుచుకోవచ్చు. ఇంట్లో తయారుచేసిన ఈ ప్రొటీన్ పౌడర్ను దాని ప్రయోజనాలను పూర్తిగా పొందడానికి ప్రతిరోజూ వాడాలి. 1/2 కప్పు స్కూన్లో 180 కేలరీల శక్తి, 12 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మీరు దీన్ని స్మూతీగానో, మిల్క్ షేడ్ గానో చేసుకొని తాగొచ్చు. లేదంటే గోరువెచ్చని పాలతో కలిపి తాగినా పర్వాలేదు.
ఏమేం కావాలి..?
ఈ ప్రొటీన్ పౌడర్ కోసం బాదం, పిస్తా, వాల్నట్స్, వేరుశనగ, సోయా బీన్స్, గుమ్మడికాయ గింజలు, అవిసె గింజలు, చియా విత్తనాలు, ఓట్స్, మిల్క్ పౌడర్ అవసరమవుతాయి. అన్నీ సమపాళ్లలో ఒక్కో కప్పు చొప్పున తీసుకోవాలి. ఎలా చేయాలంటే.. అన్ని గింజలను ఒక కడాయిలో 2 నుంచి 3 నిముషాలపాటు తక్కువ మంట మీద వేగించుకోవాలి. ఇదే పద్దతిలో ఓట్స్ ను కూడా వేగించి, పొడి చేసుకోవాలి. గింజలన్నీ చల్లబడ్డాక వాటిని కూడా పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత బ్లెండర్లో ఈ పదార్థాలన్నింటినీ పాలపొడితో కలిపి బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత పొడిని జల్లెడ పట్టి ఒక జార్లో భద్రపర్చుకోవాలి. అవసరమనుకుంటే 1/4 కప్పు కోకో పౌడర్ కూడా కలపొచ్చు. ఈ పొడిని, పాలు, షేక్స్, స్మూతీ, హల్వాగా చేసుకొని తినొచ్చు. ఈ పొడితో చేసిన ఒక స్కూప్ 10.3 గ్రాముల ప్రొటీన్ తోపాటు 45 కేలరీల శక్తి ఉంటుంది.
కావలసిన పదార్థాలు.. ఈ ప్రొటీన్ పౌడర్ కోసం 1% కప్పు చొప్పున బాదం, జీడిపప్పు, పిస్తాపప్పు అర స్పూన్ చొప్పన జాజికాయ పొడి, కుంకుమపువ్వు రేకులు, పసుపు
తయారీ: జీడిపప్పు, పిస్తాలను కళాయిలో వేగించి చల్లారాక పొడి చేసుకోవాలి. ఇదే పద్ధతిలో కుంకుమపువ్వు రేకులను కూడా రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టాలి. అన్నింటినీ టెండర్లో వేసి బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమానికి పసుపు, జాజికాయ పొడిని కలపాలి. ఆ తర్వాత అన్ని పొడులను మరోసారి బ్లెండ్ చేసుకోవాలి. పొడి కొద్దిగా మెత్తగా, జిగటగా ఉండవచ్చు. దీనిని పాలల్లో కలుపుకొని తాగాలి.
కావలసిన పదార్థాలు: 100 గ్రాముల చొప్పున ఓట్స్, వేరు శెనగ, బాదం, సోయా పిండి, 50 గ్రాముల పాలపొడి
తయారీ: పదార్థాలను ఒకదాని తరువాత ఒకటి వేగించి వాటిని వేర్వేరు గిన్నెలలో చట్టారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీలో వేసి, పొడి చేయాలి. ఈ పొడిని పాలపొడితో కలిపి బ్లెండర్లో వేసి మెత్తగా చేయాలి. ఆపై జల్లెడ పట్టి, ఒక జార్లో నిల్వచేయాలి. ఈ పొడిని పాలతో లేదంటే పండ్ల రసాలతో కలిపి తాగొచ్చు. ఈ ప్రొటీన్ పౌడర్ కేవలం పెల్లలే కాదు పెద్దవాళ్లు కూడా తాగొచ్చు. నెగ్యులర్ గా తాగడం వల్ల మెరుగైన ఫలితాలుంటాయి. శరీరానికి అవసరమైన శక్తినిస్తుంది. ఈ పౌడర్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్స్, కాపర్, జింక్, మాంగనీస్ ఖనిజాలతోపాటు, విటమిన్- ఎ.. పొటాషియం, ఫోలైట్ వంటి మినరల్స్ కూడా శరీరానికి అందుతాయి. సరిపడా డైటరీ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఈజీగా జీర్ణమవుతుంది.
శరీర కణజాలాల నిర్మాణానికి, శరీర ఎదుగుదలకు ప్రొటీన్ ఎంతో అవసరం. కణాలు, కండరాలు, ఎంజైమ్లు, హార్మోన్లను నిర్మించడం. అవి వాటివాటి విధులను సరిగ్గా నిర్వర్తించేలా చేసేది కూడా ప్రొటీనే. ఒకవేళ ఏదైనా కండరం దెబ్బజెంటే దానిని రిపేర్ చేయాలన్నా ప్రొటీస్ కావాల్సిందే. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలకు ప్రొటీన్ అవసరం ఎంతగానో ఉంటుంది. ఇది పిల్లలకు శక్తిని కూడా అందిస్తుంది. గింజలు, చేపలు, గుడ్డు. చికెన్, పాల ఉత్పత్తులలో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది.