రాగి ఖీర్
కావాల్సినవి :
రాగులు – రెండు టేబుల్ స్పూన్లు
పాలు – నాలుగు కప్పులు
చక్కెర లేదా బెల్లం – అర కప్పు
యాలకుల పొడి – పావు టీస్పూన్
బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు, కిస్మిస్ – అన్నీ కలిపి రెండు టేబుల్ స్పూన్లు
తయారీ : రాగుల్ని నీళ్లలో వేసి బాగా కడగాలి. అందులోనే మరికొన్ని నీళ్లు పోసి ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు నానబెట్టాలి. తరువాత వాటిని మిక్సీజార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. గిన్నెలో పాలు పోసి కాగబెట్టి, అందులో రాగి పేస్ట్ వేయాలి. గరిటెతో తిప్పుతూ దాదాపు అరగంట సేపు మరిగించాలి. ఆ తర్వాత యాలకుల పొడి వేసి కలపాలి. చివరిగా బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేయాలి.