సీజన్ తో పాటు స్కిన్ కేర్ రొటీన్ కూడా మారుతుంది. శీతాకాలంలో చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. అందుకోసం ఇంటివద్ద తయారు చేసుకున్న బాడీ స్క్రబ్ వాడటం బెటర్. ఇదయితే మురికితో పాటు మృతకణాల్ని కూడా తొలగిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.
కావాల్సినవి..
- బియ్యప్పిండి-50 గ్రా.,
- మసూర్ దాల్ (ఎర్రకందిపప్పు)- 30 గ్రా.
- ఓట్స్ - 20 గ్రా.
- ముల్తానీ మట్టి- 20 గ్రా.
- రెండు గ్రాముల చొప్పున వేపాకుల పొడి,
- పసుపు,
- కొన్ని చుక్కల లావెండర్ లేదా ఎసెన్షియల్ ఆయిల్,
- కొంచెం పెరుగు.
Also Read : Kitchen Tip : పెనం మాడిందా.. పరేషాన్ వద్దు
తయారీ..
ఒక గిన్నెలో పైన చెప్పిన వాటన్నింటినీ వేసి కలపాలి. ఈ స్క్రబ్ తో ముఖం మీద మెల్లిగా మసాజ్ చేయాలి. ఆరాక నీళ్లతో కడిగేయాలి. దాంతో ముఖం మీది మురికి, డెడ్ సెల్స్ పోయి చర్మం తాజాగా ఉంటుంది.