![కిచెన్ తెలంగాణ : జొన్న హల్వా](https://static.v6velugu.com/uploads/2023/08/How-to-make-sorghum-halwa_H0gLzwphWX.jpg)
జొన్న హల్వా
కావాల్సినవి :
నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు
జొన్న పిండి – ఒకటిన్నర కప్పు
జీడిపప్పులు, ఎండుద్రాక్ష – ఒక్కోటి ఎనిమిది చొప్పున, పాలు – 200 ఎం.ఎల్.
అరటి పండు – ఒకటి
బెల్లం – అర కప్పు
చక్కెర – పావు కప్పు
యాలకుల పొడి – అర టీస్పూన్
తయారీ : పాన్లో నెయ్యి వేడి చేసి అందులో జొన్న పిండి, జీడిపప్పులు, ఎండుద్రాక్ష వేగించాలి. తర్వాత అందులో కొద్దికొద్దిగా పాలు పోస్తూ కలపాలి. బాగా పండిన అరటి పండును మెత్తగా మెదిపి, దాన్ని కూడా వేసి కలపాలి. ఆ తర్వాత బెల్లం, చక్కెర వేసి మరోసారి కలపాలి. గరిటెతో తిప్పుతూ పది నిమిషాలు ఉడికించాలి. చివరగా యాలకుల పొడి వేసి కలిపితే జొన్న హల్వా రెడీ.