యూట్యూబ్‌లో వీడియోలే కాదు షార్ట్స్ కూడా తెగ చూస్తుంటారు. అందుకే వీడియోలు చేయని వాళ్లు కూడా షార్ట్స్ చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే, ఇప్పుడు గూగుల్ సాయంతో యూట్యూబ్ షార్ట్స్ కోసం ఏఐ వాడే అవకాశం కల్పిస్తోంది ఈ యాప్. షార్ట్స్ కోసం యూజర్లు ఆరు సెకండ్ల వీడియో క్లిప్స్ తీసుకోవచ్చు. అదెలాగంటే.. క్రియేటర్స్ వీడియో తీసేటప్పుడు ఏదైనా రికార్డ్ చేయలేకపోయినా
తర్వాత వియో (veo) ద్వారా షార్ట్ క్లిప్ క్రియేట్ చేసి కంటెంట్‌లో ఇన్సర్ట్ చేయొచ్చు. అయితే ఈ క్రియేషన్స్‌కి వాటర్ మార్క్ ఉంటుంది. ఇది ఏఐతో జనరేట్ అయిందనే లేబుల్ వ్యూయర్స్‌కు తెలుస్తుంది. ఈ ఫీచర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే డ్రీమ్ స్క్రీన్‌లా కనిపిస్తుంది. దానిపై షార్ట్ క్లిప్ వస్తుంది.