రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. WhatsApp ద్వారా ఫుడ్ ఇలా ఆర్డర్ చేసుకోండి

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. WhatsApp ద్వారా ఫుడ్ ఇలా ఆర్డర్ చేసుకోండి

రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ(IRCTC) భాగస్వామి RAILOFY శుభవార్త చెప్పింది. వాట్సాప్ చాట్‌బాట్‌(WhatsApp Chatbot) ద్వారా రైళ్లలో ఆహారాన్ని ఆర్డర్ చేసుకునేందుకు కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. 

పండుగల సీజన్‌లలో ప్రయాణికులు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు నాణ్యమైన ఆహారం దొరక్క ఇబ్బంది పడుతుంటారు. ఒకవేళ ఆహారం లభించప్పటికీ, ఆర్డర్ చేసే మార్గాల గురించి చాలా మంది ప్రయాణికులకు తెలియదు. దాంతో, ఎందుకులే అన్నట్లు రైల్వే స్టేషన్ల వద్ద ప్లాట్‌ఫారమ్‌లపై దొరికే ఆహారంతో సరిపెట్టుకుంటుంటారు. ఆ ఇబ్బందులను అధిగమించేందుకు RAILOFY.. వాట్సాప్ చాట్‌బాట్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. 

ALSO READ : వామ్మో.. Pantoprazole ట్యాబ్లెట్స్ పరిస్థితి కూడా ఇలా ఉందా..?

ప్రయోజనాలు 

  • RAILOFY ద్వారా హల్దీరామ్, సబ్‌వే, బికనెర్‌వాలా వంటి ప్రసిద్ధ రెస్టారెంట్‌ల నుండి ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. 
  • మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ ట్రాకింగ్ కూడా చేయవచ్చు. అనగా, జొమాటో, స్విగ్గి యాప్‌లలో చూపించినట్లు ఫుడ్ ఎక్కడుంది అనేది తెలుసుకోవచ్చు. 
  •  క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం కూడా కలదు. 

ఎలా ఆర్డర్ చేసుకోవాలంటే..?

  • మొదట మీ ఫోన్‌లో +91 74411111266 నంబర్‌ను సేవ్ చేయండి.
  • అనంతరం సేవ్ చేసిన నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపండి.
  • ఆపై మీకు నచ్చిన భాషను ఎంచుకోవలసిందిగా రిప్లై వస్తుంది. మీకు నచ్చిన భాషను ఎంచుకోండి.
  • తరువాత బుకింగ్ కోసం PNR నెంబర్, పేరు ఎంటర్ చేయండి.
  • ఇప్పుడు డెలివరీ స్టేషన్‌ను ఎంచుకోండి. 
  • మీరు ఎంచుకున్న డెలివరీ స్టేషన్‌ సమీపంలో ఉన్న రెస్టారెంట్ల జాబితా డిస్‌ప్లే అవుతుంది. అందులో మీకు నచ్చిన  రెస్టారెంట్‌ను ఎంచుకొని.. ఆర్డర్ పెట్టండి.
  • మీరు పెట్టిన ఆర్డర్‌.. ఎంచుకున్న స్టేషన్‌లో మీ సీటు వద్దకు డెలివరీ చేస్తారు.