పిల్లలు నిద్రలో ఉలిక్కిపడుతున్నరా..? ఏం చేయాలంటే..

పిల్లలు నిద్రలో ఉలిక్కిపడుతున్నరా..? ఏం చేయాలంటే..

కొందరు పిల్లలు నిద్రలోంచి ఉలిక్కిపడిలేస్తారు. భయపడుతూ ఏడుస్తుంటారు. సముదాయించి మళ్లీ నిద్రపుచ్చడానికి ఎంత ప్రయత్నించినా పడుకోరు. ఏదో తెలియని భయంతో కంగారు పడుతుంటారు. ఇది పిల్లలున్న ప్రతి ఇంట్లో జరిగేదే. ఎప్పుడో ఒకసారి ఇలా అయితే పర్వాలేదు.. కానీ ఇదే తరచూ జరుగుతోందంటే కాస్త ఆలోచించాల్సిందే. వాళ్ల భయానికి, కన్నీళ్లకి కారణాన్ని తెలుసుకుని సాయం చేయకపోతే పెరిగి పెద్దయ్యాక కూడా ఆ భయం వాళ్లని వదలదు. అందుకే పసివయసులోనే ఆ భయాల్ని పోగొట్టాలి. అందుకోసమే ఈ చిట్కాలు.. ఇవి పాటిస్తే పిల్లలో భయాల్ని దూరం చేయొచ్చు.

పెద్దల్నే కాదు పిల్లల్ని కూడా పీడకలలు నెంటాడుతూ ఉంటాయి. వాళ్లని భయపెట్టే విషయాలు కలల ద్వారా వాళ్ల ముందుకొస్తాయి. అలాంటి సమయాల్లో పిల్లలు భయపడి నిద్రలేవడం సహజం. మెలకువలోకి వచ్చాక కూడా వాళ్లు వాటినే గుర్తుచేసుకొని భయపడుతూనే ఉంటారు. అలాంటప్పుడు వాళ్లని బలవంతంగా పడుకోబెట్టే ప్రయత్నం చేయకూడదు.. దగ్గరకు తీసుకుని ప్రేమగా హత్తుకోవాలి. ఏం కాదు.. 'కల' మాత్రమే అని సముదాయించాలి. 

కాసేపు పక్కనే పడుకుని తల నిమురుతూ మాట్లాడాలి. వాళ్లని అంతలా భయపెడుతున్న విషయం గురించి అడిగి తెలుసుకోవాలి.ఓపికగా వినాలి కొందరు పిల్లలు తమకు వచ్చిన కలల గురించి చెప్పడానికి ట్రై చేస్తుంటారు. అప్పుడు. వాళ్ల మాటలను అడ్డుకోకూడదు. వాళ్లు చెప్పేది ఓపికగా వినాలి. ఆ కలలే తరచూ వస్తున్నాయేమో తెలుసుకోవాలి. ఎందుకంటే పిల్లలో ఉండే భయాలే వాళ్లకి కలల రూపంలో వస్తుంటాయి. అందుకే వాళ్లకెలాంటి కల వచ్చిందో తెలుసుకుంటే వాళ్ల భయాల గురించి కూడా తెలుస్తుంది.

భయపెట్టకూడదు

పిల్లలకు భయపెట్టే కలలు రావడానికి తల్లిదండ్రులు కూడా ఒకరకంగా కారణమే. చకచకా తినాలి... త్వరగా నిద్రపోవాలి... మారాం చేయకూడదు.. చెప్పిన మాట వినాలని.. లేదంటే దెయ్యం వస్తుంది... బూచోడికి పట్టిస్తా అంటూ భయపెడుతుంటారు. మనం సరదాకే అన్నా ఆ పసిమనసుల్లో ఈ మాటలు గట్టిగా నాటుకుంటాయి. బూచోడు ఎలా ఉంటాడో. ఊహించుకుంటారు. రూపమే కలలోనూ. వాళ్లని వెంటాడుతుంటుంది. అందుకని పిల్లలకు లేని పోని భయాలు కలిగించొడ్డు.

చీకటికి దూరంగా

చీకటి అంటే చాలామంది పిల్లలకు భయం.. అందుకే రాత్రిళ్లు లైట్లన్నీ ఆపేసి బలవంతంగా పడుకోబెట్టొద్దు. వాళ్లు నిద్రపోయే వరకు తక్కువ వెలుతురు ఉండే లైట్లు ఉంచాలి. నిద్రపోయాక లైట్ ఆఫ్ చేయాలి. ఒకవేళ మధ్యలో లేచినా గదిలో వెలుతురు ఉండేలా జీరో బల్బ్ ఏర్పాటు చేయాలి.

కథలు చెప్తున్నారా

రాత్రి పడుకునే ముందు కథలు వినడం. పిల్లలకు ఓ సరదా కథలు చెప్పమన్నారు. కదా అని దెయ్యాల కథలు చెప్పకూడదు. ఇలాంటివి పిల్లల్ని పిరికి వాళ్లుగా మారుస్తాయి. దాంతో నీడను చూసినా భయపడతారు వాళ్లు. అందుకే అలాంటి కథలు చెప్పడం మంచిదికాదు. హాయిగా నిద్రలోకి జారుకునేలా మంచి కథలు చెప్పాలి.

లాలిపాటలు

పిల్లలను నిద్రపుచ్చడం కాస్త కష్టమైన పనే అయితే, లాలి పాటలు పాడితే ఆపని సులభమవుతుంది. కానీ, చాలామంది ఆ పాటల కోసం స్మార్ట్ఫోన్ ని అశయిస్తుంటారు. అలాకాకుండా మీరే లాలి పాట పాడుతూ జో కొడితే పిల్లలు హాయిగా నిద్రపోతారు. పడుకునే ముందు వినే పాటలు నిద్రలో కలలు రాకుండా చేస్తాయి.

ఏం చూస్తున్నారు:

రోజంతా గడిపిన పరిసరాలు, చూసిన దృశ్యాలే రాత్రిళ్లు కళ్లముందు మెదులుతాయి. భయపెట్టేవి చూస్తే పిల్లలకు కూడా అమె పీడకలలుగా వస్తాయి. అందుకే పిల్లలుంటున్న ఇండ్లలో భయపెట్టే సినిమాలు, సీరియల్స్ పెట్టకూడదు. భయం కలిగించే మాటలకు కూడా దూరంగా ఉండాలి.

== వెలుగు లైఫ్