Career Tips : ఇలా ప్లాన్ గియ్యాలె.. అలా పట్టు పట్టాలె..!

Career Tips : ఇలా ప్లాన్ గియ్యాలె.. అలా పట్టు పట్టాలె..!

మనిషికి చాలా గోల్స్ ఉంటాయి. ప్రతీ మనిషికీ 'టీచర్ కావాలి, రైటర్ కావాలి. డాక్టర్ కావాలి, డైరెక్టర్ కావాలి, ఇంజినీర్ కావాలి, బిజినెస్ మెన్ కావాలి' ఇలా ఏదో ఒక ప్రొఫెషనల్ గోల్ ఉంటుంది. రేపటి నుంచి రన్నింగ్ మొదలు పెట్టాలి. లాభం లేదు జిమ్​కి ఇక వెళ్లాల్సిందే. జంక్​ ఫుడ్​మానేస్తా అని ఇలా ఎన్నో పర్సనల్​ గోల్స్​ కూడా పెట్టుకుంటారు. వాటి గురించి  పెద్ద కలలు కంటూ ఉంటారు. మరోవైపు ఆ కలలు నిజమైనట్టు విజువలైజ్ చేసుకుంటారు. కళ్లు మూసుకొని అందులోనే జీవిస్తారు! అయినాకానీ అందరూ ఎందుకు తమ గోల్స్ ని అందుకోరు? గోల్ సాధించినవాళ్ల మీద స్టడీ చేసి.. 'గోల్ ప్లాన్' తాళం తీశారు పరిశోధకులు!

కొంత మంది నీళ్లు తాగినంత ఈజీగా  తమగోల్​ని అందుకుంటారు." కొంతమందికి గోల్ సాధించే సరికి కషాయం.. తాగినంత కష్టమవుతుంది. ఇక, కొంతమంది అనుకున్నవేం సాధించకుండానే ప్రయాణం ముగిస్తారు. గోల్స్ సాధించడానికి ఏం కావాలో వీళ్లకు తెలియకపోవడం వల్లే కలలు... కలలుగా నే మిగిలిపోతున్నాయి. అందుకే, కేవలం గోల్స్ ఉంటే సరిపోదు. వాటిని సాధించినప్పుడే జీవితానికి ఒక అర్ధం ఉంటుంది. 'దానికి అదృష్టం ఉండాలి' అంటే సరిపోదు. అంతకు మించి.. కావాలి. అదొక మ్యాజికల్ ఫార్ములా!

ప్లానింగ్

అమెరికాలోని యూజిన్లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ ఓరేగాన్' పరిశోధకులు 'గోల్' సాధించ దానికి ఒక మనిషికి ఏం కావాలి? అనే ప్రశ్నని తీసుకొని స్టడీ చేశారు. సైకాలజిస్ట్​ ల టీమ్ ఈ స్టడీలో పాల్గొన్నారు. "చూడబోతే ఇదొక లాజి క్​లాగ ఉంది. తాము అనుకున్న గోల్స్ సాధించిన సక్సెస్​ ఫుల్​  పర్సన్స్​ని..., సాధించని వాళ్లను.. రోజూ ఏం చేస్తున్నారు? వాళ్ల ప్లానింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో రాయమన్నారు.  అది చూసిన పరిశోధకులు  మేం చాలా ఆశ్చర్య పోయారట. వాళ్ల ప్లానింగ్​  గోల్​ అచీవ్​మెంట్​ ని డిసైడ్​ చేసింది. అని స్టడీ హెడ్​ సైకాలజిస్టు లాడ్​వింగ్ అన్నాడు..

ప్లాన్ ప్రకారం పోతే...

ఈ ఇంట్రెస్టింగ్ ఎక్స్ పర్మెంట్ ని మూడు వందల మంది స్టూడెంట్లపై చేశారు పరిశోధ కులు. వాళ్లకు ఎలాగూ పాస్ కావాలి, పలానా పర్సెంటేజీ మార్కులు తెచ్చుకోవాలనే గోల్స్ ఎలాగూ ఉంటాయి. ఆ గోల్స్ కి కొన్ని ఫిట్​ నెస్ గోల్స్​ ను  యాడ్ చేసి టాస్క్ ఇచ్చారు. రోజూ జిమ్ కి వెళ్లాలని చెప్పారు. లేదా వాళ్లకు ఇష్టమైన రన్నింగ్, స్విమ్మింగ్ వెళ్లడం కూడా ఓకే  చేశారు. అలా ఒక సంవత్సరమంతా వాళ్లను పరిశీలిస్తూ స్టడీ చేశారు. 

ఒక సంవత్సరం తర్వాత ఎవరైతే కరెక్ట్ గా ప్లాన్ చేసుకోలేదో.. వాళ్లంతా మధ్యలోనే తమ వర్కవుట్లను మానేశారు. "ఎందుకు వెళ్లలేకపోయారు?" అనడిగితే.. ఎక్కువ మంది ' మా ఎగ్జామ్స్ కోసం మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. అందుకే ఫిట్ నెస్ గోల్స్ ని  అందుకోలేకపోయాం' అని చెప్పారు. ఏదేమైనా. వాళ్లు తమ గోల్స్ కి తగ్గట్టుగా అకడమిక్​ని, ఫిట్​ నెస్​ ను సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం.... చేసుకున్నా  వాటిని పాటించకపోవడం వల్లే తమ ఫిట్​ నెస్ గోల్స్ అందుకోలేకపోయారని తేల్చారు. అటు అకడమిక్స్ ని, ఇటు ఫిట్ నెస్ ప్రోగ్రామ్స్ ని బ్యాలెన్స్ గా ప్లాన్ చేసుకున్న వాళ్లు తమ ఫిట్ నెస్ తో పాటు, అకడమిక్స్ కూడా అందుకున్నారు. అయితే వీళ్లు పది శాతం కంటే తక్కువ మందే ఉన్నారు. అంటే ప్లానింగ్ లోపం. ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు..

ఎలా చేసుకోవాలి?

"సరే మీరే చెప్పండి ఎలా ప్లాన్ చేసుకోవాలో అని ఆ ఎక్స్ పర్ట్ నే అడిగితే ఏమన్నారో తెలుసా? 'కేవలం ప్లాన్ చేసుకుంటే సరిపోదు. రాసుకున్న ప్రతి ప్లాన్ని అమలులో పెట్టాలి. ప్లాన్స్​ అన్నింటిని నీట్ గా రాసుకున్న తర్వాత రోజూ చేస్తున్నామా? లేదా? అని 'ఎస్' ఆర్ 'నో'టిక్స్ పెట్టుకోవాలి. దీనికోసం పెన్ను, పేపర్ వాడతారా? ఏదైనా యాప్ వాడతారా? అనేది మీ ఇష్టం.  ఆ ప్లాన్ ఎంత రియలిస్టిక్ గా ఉందనేది కూడా చాలా ముఖ్యం' అని వాళ్లు చెప్పాడు. చూస్తుంటే గోల్​ను చేరుకోవడానికి ప్లానింగ్ 'కీ' అని అర్థమైంది. కదూ? 'సరైన ప్లానింగ్ లేకుండా, ఒకవేళ సరైనా ప్లానింగ్ ఉన్నా దాన్ని ఫాలో కాని వాళ్లు కలలు నిజం చేసుకోవడం అసాధ్యం అని లాడ్​ వింగ్ చెప్పారు.

–వెలుగు, లైఫ్​–