సోషల్ మీడియాలో ప్రైవసీకి ‘జంబో‘

సోషల్ మీడియాలో ప్రైవసీకి ‘జంబో‘

సోషల్ మీడియా యాప్స్ లో ప్రైవసీ అన్నింటికంటే చాలా కీలకం.ఏది పోస్ట్ చేయాలన్నా, షేర్ చేయాలన్నా కొన్నిసార్లు ఆలోచించాలి. లేకుంటే ఏదైనాఇబ్బంది తలెత్తవచ్చు. కొన్ని పోస్ట్ లు అందరినీ మెప్పిం చకపోవచ్చు.ఇలాంటి ఇబ్బందులకు పరిష్కారం చూపే ప్రైవసీ యాప్స్ చాలానే ఉన్నా యి. వాటిలోమరిన్ని కొత్త ఫీచర్లతో రాబోతోంది ‘జంబో’.ఈ సోషల్ మీడియా ప్రైవసీ అసిస్టెంట్ ట్యాప్ ప్రస్తుతానికి ఐఓఎస్ పై మాత్రమే అందుబాటులో ఉన్నా, త్వరలోనే ఆండ్రాయిడ్ ఓఎస్ పై కూడా అందుబాటులోకి వస్తుంది.ఈ యాప్ ను ‘ట్విట్టర్, ఫేస్ బుక్, గూగుల్సెర్చ్, అమెజాన్ అలెక్సా యాప్’ లతో లింక్ చేసుకోవచ్చు. మరికొద్దిరోజుల్లో ‘ఇన్ స్టాగ్రామ్,టిండర్’ వంటి ఇతర యాప్ లలో కీ అందుబాటులోకి రాబోతోం ది.‘ట్విట్టర్’లో నెల క్రితం లేదా ఏడాది క్రితం ట్వీట్ లను డిలీట్ చేయాలనుకుంటే జంబోలో సెట్టింగ్స్ లో సెట్ చేసుకోవచ్చు. డిలీ ట్అయిన మెసేజెస్ జంబో ఆర్కివ్స్ లోకి వెళ్లిపోతాయి. సాధారణంగా ఇవన్నీ విడివిడిగా డిలీట్ చేసేందుకు చాలా సమయం పడుతుంది.అయితే ఈ యాప్ తో సులభంగా కావాల్సినటైమ్, సందర్భం, అంశానికి సంబంధించిన వాటిని ఒకేసారి డిలీట్ చేయొచ్చు. ప్రస్తుతం ట్విట్టర్ రూపొందించి న నిబంధనల ప్రకారం ‘జంబో’ యాప్ ద్వారా 3,200 ట్వీట్లను మాత్రమే డిలీట్ చేయొచ్చు. ఫేస్ బుక్కు సంబంధించి ‘జంబో’లోమూడు ఆప్షన్లు ఉంటాయి. అవి ‘వీక్, మీడియమ్,స్ట్రాం గ్’. ‘వీక్’ సె లెక్ట్చేసుకుంటే మీ ప్రొఫైల్ అందరికీ కనిపిస్తుంది.‘మీడియమ్’ సెలెక్ట్ చేసుకుంటే ఫ్రెండ్స్ కు మాత్రమే కనిపిస్తుంది. అదే ‘స్ట్రాంగ్’సెలెక్ట్ చేసుకుంటే ఆ సమాచారం మీకు మాత్రమే కనిపిస్తుంది. ఈ ఫీచర్ ప్రైవసీకి బాగా ఉపయోగపడుతుంది. గూగుల్ సెర్చ్ కు సంబంధించి టైమ్ లిమిట్, అలెక్సాకు సంబంధించి వాయిస్ రికార్డింగ్ లలో అనేక ప్రైవసీ ఫీచర్లు జంబోలో ఉన్నా యి. సోషల్ మీడియాలో ప్రైవసీకి ప్రాధాన్యం ఇచ్చే వాళ్లకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.