ఊహించని ఘటన ఎదురైతే ఎలా రియాక్ట్ కావాలి?

మనమే హీరో కావాలే

పెద్దపల్లి జల్లా రామగిరి మండలం కల్వచర్ల శివారులో పట్టపగలు లాయర్‌‌‌‌ దంపతులు హత్యకు గురికావడం కలకలం రేపింది. ఈ జంట హత్యలు జరుగుతుండగా.. ఆ చుట్టుపక్కల ఎంతో మంది ఉన్నారు. కార్లు, బస్సులు, బైకుల్లో ఎంతో మంది అటుగా వెళ్లారు. కానీ ఎవరూ ఆగలేదు.. ఒక్కరు కూడా ఈ హత్యలను ఆపే ప్రయత్నం చేయలేదు. మర్డర్‌‌‌‌ జరుగుతుండగా సహాయం కోసం ఎదురుచూడటం సహజం.. కానీ ఒక్కరు కూడా స్పందించరు. కొందరు పట్టించుకోకుండా వెళ్లిపోతే, మరికొందరు ఫొటోలు, వీడియోలు తీస్తుంటారు. ఇండియాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఎన్నో ఘటనలు జరిగినా జనం తీరు ఇలాగే ఉంటోంది. అసలు ఎందుకిలా జరుగుతోంది?

పబ్లిక్‌‌‌‌గా మర్డర్‌‌‌‌ లేదా అటాక్​ జరిగి చుట్టుపక్కల వారు రియాక్ట్‌‌‌‌ కానప్పుడు సైకాలజిస్టులు కిట్టి జెనోవీస్‌‌‌‌ సెన్సేషనల్‌‌‌‌ మర్డర్‌‌‌‌ కేసును ప్రస్తావిస్తూ ఉంటారు. 1964లో  న్యూయార్క్‌‌‌‌కు చెందిన జెనోవీస్‌‌‌‌ పని ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఆమెపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. విచక్షణారహితంగా ఆమెను పొడిచి వెళ్లిపోయాడు. 38 మంది ఈ క్రైం జరిగేటప్పుడు అక్కడే ఉన్నా ఎవరూ పోలీసులకు ఫోన్‌‌‌‌ చేసే ప్రయత్నం చేయలేదు. దీంతో మళ్లీ వెనక్కి వచ్చిన ఆ దుండగుడు ఆమెను మరోసారి కత్తితో దారుణంగా పొడిచాడు. ఇలా అర గంటలో మొత్తంగా 15 సార్లు ఆమెను పొడిచాడు. సహాయం కోసం జెనోవీస్‌‌‌‌ అరుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. చాలా మంది ఇండ్లలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. చివరికి ఈ ఘటన జరిగిన దాదాపు గంట తర్వాత ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే చాలా ఆలస్యం కావడంతో తన అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ముందే జెనోవీస్‌‌‌‌ రక్తపు మడుగులో ప్రాణాలు విడిచింది. ఈ ఇన్సిడెంట్‌‌‌‌ తర్వాతే అమెరికాలో ఎమర్జెన్సీ ఫోన్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ 911 అందుబాటులోకి వచ్చింది.

బైస్టాండర్‌‌‌‌ ఎఫెక్ట్‌‌‌‌.. జెనోవీస్‌‌‌‌ సిండ్రోమ్‌‌‌‌

ఈ కేసులో ప్రజల రియాక్షన్‌‌‌‌పై ఫేమస్‌‌‌‌ సైకాలజిస్టులు జాన్‌‌‌‌ డార్లే, బిబ్‌‌‌‌ లటానే ఒక స్టడీ చేశారు. మర్డర్‌‌‌‌ జరుగుతున్నా స్పందించకుండా ఉండటాన్ని ‘జెనోవీస్‌‌‌‌ సిండ్రోమ్’, ‘బై స్టాండర్‌‌‌‌ ఎఫెక్ట్‌‌’గా‌‌ పిలిచారు. ఇది ప్రజల్లో ఉండే చాలా సాధారణమైన విషయంగా పేర్కొన్నారు. ఎవరూ స్పందించనిది మనమే ఎందుకు రియాక్ట్‌‌‌‌ కావాలని భావించడం, నా ఒక్కడికే బాధ్యత ఉందా.. మిగతా వాళ్లు ముందుకు వస్తే నేను కూడా వెళతా అని భావన, మర్డర్‌‌‌‌ చేసేవాళ్లంతా చెడ్డవారే.. వాళ్లతో మనం తలపడలేం అనే భయం, మర్డర్‌‌‌‌ను ఆపడం వల్ల మనకు ఏం వస్తుంది.. పైగా మనకి ఏమైనా హాని తలపెడితే ఎలా అనే ఆందోళన ఇలా చాలా కారణాలు ఇందులో ఉంటాయని వెల్లడించారు. ఇక్కడ మూడు విషయాలను మనం గుర్తించాలి. ఏదైనా ఇన్సిడెంట్‌‌‌‌ జరిగినప్పుడు ప్రజల్లో అదేంటో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ, క్రైం సీన్‌‌‌‌కు దగ్గరగా వెళ్లే ధైర్యం మాత్రం వారికి ఉండదు. ఒకవేళ క్రైమ్‌‌‌‌కు పాల్పడే వారిని అడ్డుకుంటే అనవసరంగా పోలీసు కేసులు, కోర్టు కేసులు అంటూ తిరగాల్సి వస్తుందనే భయం, తమను కూడా క్రైంలో ఒక భాగంగా చూస్తారనే ఆందోళన వల్ల ఇలా చేస్తుంటారు. సాధారణంగా ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్‌‌‌‌ కాకుండా ఉండేందుకు జనం ముందుగానే సైకలాజికల్‌‌‌‌గా సిద్ధపడి ఉంటారు.

కాలేజీ స్టూడెంట్లపై స్టడీ

1968లో సైకాలజిస్టులు జాన్‌‌‌‌ డార్లే, బిబ్‌‌‌‌ లటానే జెనోవీస్‌‌‌‌ హత్యకు సంబంధించి సాక్షుల సైకాలజీపై పెద్ద రీసెర్చ్‌‌‌‌ చేశారు. వీరి రీసెర్చ్‌‌‌‌లో తేలిన రిజల్ట్‌‌‌‌ ఏమిటంటే క్రైం సీన్‌‌‌‌లో ఎక్కువ మంది జనం ఉంటే రియాక్షన్‌‌‌‌ చాలా తక్కువగా ఉంటుంది. అదే మనుషుల సంఖ్య తక్కువగా ఉంటే రియాక్షన్‌‌‌‌ ఎక్కువగా ఉంటుందని తేల్చారు. ఇందు కోసం కాలేజీ స్టూడెంట్లపై వారు ఒక స్టడీ చేశారు. కొందరు కాలేజీ స్టూడెంట్లను మూడు గ్రూపులుగా చేశారు. కిట్టి జెనోవీస్‌‌‌‌ ఇన్సిడెంట్‌‌‌‌ లాంటి సిచ్యువేషనే క్రియేట్‌‌‌‌ చేసి స్టూడెంట్ల రియాక్షన్‌‌‌‌ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. తొలి ఎక్స్‌‌‌‌పెరిమెంట్‌‌‌‌లో కాలేజ్‌‌‌‌ స్టూడెంట్లకు తోటి స్టూడెంట్లతో మాట్లాడే టాస్క్‌‌‌‌ ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్క పార్టిసిపెంట్‌‌‌‌కు హెడ్‌‌‌‌ఫోన్‌‌‌‌, మైక్రోఫోన్‌‌‌‌ ఇచ్చి ఒక రూమ్‌‌‌‌లో ఒంటరిగా కూర్చోబెట్టారు. వారితో ఒక్కో స్టూడెంట్‌‌‌‌తో ఇంటర్‌‌‌‌కామ్‌‌‌‌ ద్వారా మాట్లాడించారు. ఆ తర్వాత పార్టిసిపెంట్స్‌‌‌‌ను మూడు గ్రూపులుగా చేశారు. మొదటి గ్రూపులోని వ్యక్తి తాను వేరే ఒక్కరితోనే మాట్లాడుతున్నానని భావించేలా చేశారు. రెండో గ్రూపులోని వారు ఇద్దరితో మాట్లాడుతున్నట్టుగా సిచ్యువేషన్‌‌‌‌ క్రియేట్‌‌‌‌ చేశారు. మూడో గ్రూపులోని వ్యక్తులు ఐదుగురికంటే ఎక్కువ మందితో మాట్లాడుతున్నట్టు భావించేలా చేశారు.ఈ సంభాషణ జరుగుతున్న ఒకానొక దశలో ఇంటర్‌‌‌‌కామ్‌‌‌‌లో నుంచి ఒక వ్యక్తి హెల్ప్‌‌‌‌ అంటూ భయం భయంగా అరిచేలా చేశారు. ఈ సిచ్యువేషన్‌‌‌‌లో స్టడీలో పార్టిసిపేట్‌‌‌‌ చేసిన వారిలో తాను ఒక్కరే ఉన్నారని భావించిన వ్యక్తుల్లో 85 శాతం మంది రూమ్‌‌‌‌ నుంచి బయటకు వచ్చి సహాయం చేసే ప్రయత్నం చేశారు. అదే తనతో పాటు మరో ఇద్దరు ఉన్నారని భావించిన వ్యక్తులు ఉన్న రూమ్‌‌‌‌లో రియాక్షన్‌‌‌‌ 64 శాతానికి తగ్గింది. అదే తమతో పాటు మరో నలుగురు ఉన్నారని భావించిన వ్యక్తులు 31 మంది మాత్రమే హెల్ప్‌‌‌‌ చేసేందుకు ముందుకొచ్చారు.

చట్టాల్లోనూ మార్పులు చేయాలి

మరోవైపు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లలో సాయం చేసేలా చట్టాల్లో కూడా మార్పులు తీసుకురావాలి. బ్రెజిల్‌‌‌‌, జర్మనీ‌‌, కెనడా తదితర దేశాల్లో క్రైం సీన్‌‌‌‌లో ఉండి హెల్ప్‌‌‌‌ చేయకపోతే నేరం చేసినట్టే. ఇందుకు తగ్గట్టుగా అక్కడి చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు. అమెరికాలో కూడా గుడ్‌‌‌‌ సమ్మరిటన్‌‌ ‌‌లా అందుబాటులోకి వచ్చింది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎవరైనా ముందుకొచ్చి సాయం అందిస్తే వాళ్లకి ప్రభుత్వమే పూర్తి ప్రొటెక్షన్‌‌‌‌ కల్పిస్తుంది.

ఎమర్జెన్సీ అని ఎలా తెలియాలి?

ఎమర్జెన్సీ సిచ్యువేషన్లలో ఐదు స్టెప్స్‌‌‌‌లో బిహేవియరల్‌‌‌‌ ప్రాసెస్‌‌‌‌ ఉంటుంది. 

1. ఏదో జరుగుతోందని నోటీస్‌‌‌‌ చేయడం. ఒక సిచ్యువేషన్‌‌‌‌ను గుర్తించడంలో మనల్ని ఎన్నో విషయాలు ప్రభావితం చేస్తాయి. మనం తొందరలో ఉండటం. ఒక గ్రూపులో ఉండటం వల్ల జరిగిన సంఘటనను గుర్తించలేకపోవచ్చు.

2. అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్‌‌‌‌ అని గుర్తించడం. కొన్ని సందర్భాల్లో జనం అక్కడ జరిగే సీన్‌‌‌‌తో షాక్‌‌‌‌కు గురవుతారు. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి టైం పడుతుంది. అందువల్ల వెంటనే స్పందించలేరు.

3. మన బాధ్యతను గుర్తించడం. అక్కడ సహాయం కోరే వారికి నిజంగా ఆ అవసరం ఉందా అనేది గుర్తించాలి. హెల్ప్‌‌‌‌ చేయగలిగే కెపాసిటీ మనకు ఉందా లేదా తెలుసుకోవాలి. విక్టిమ్‌‌‌‌కు మనకు మధ్య రిలేషన్‌‌‌‌షిప్‌‌‌‌ను కూడా గుర్తుంచుకోవాలి.

4. ఎలా సహాయం చేయగలమో ఎంచుకోవడం. ఇది బాధితులకు నేరుగా హెల్ప్‌‌‌‌ చేయగలిగేదై ఉండాలి. లేదా పోలీసులకు కాల్‌‌‌‌ చేయడం చేయాలి.

5. యాక్షన్‌‌‌‌లోకి దిగడం. మనం ఎంచుకున్న సహాయాన్ని అందించడం.

ఎమర్జెన్సీ టైమ్​లో ఎలా రియాక్ట్​ కావాలి?

పరిస్థితిని వెంటనే గుర్తించడం, అలాంటి పరిస్థితులను గురించి తెలుసుకోవడం, మనం బై స్టాండర్స్‌‌‌‌(సాక్షులం) అని గుర్తించడం, అలా గుర్తిస్తే మరోసారి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్‌‌‌‌ ఎదురైతే మనం వెంటనే గుర్తించడానికి వీలవుతుంది, మన రెస్పాన్సిబులిటీని క్లియర్‌‌‌‌గా గుర్తించగలం.

ఎవరికి సహాయం కావాలో ముందే మనం తేల్చుకోవాలి. ఒక్కోసారి డ్రగ్స్‌‌‌‌, ఆల్కహాల్‌‌‌‌ ఎడిక్ట్స్‌‌‌‌ కారణంగా ఎవరు బాధితులో వెంటనే తేల్చుకోవడం కష్టమవుతుంది. అవసరంలో ఉన్నవారికి అందరూ సాయం చేసేందుకు ముందుకు రారు. అందువల్ల మనం సొంత ఐడియాలు ఉండాలి.

వేర్వేరు సిచ్యువేషన్లలో ఎలా సాయం చేయాలనే దానిపై అవగాహన ఉండాలి. సహాయం చేయడానికి మన సామర్థ్యం సరిపోతుందా అనేది గుర్తించాలి.

ఒకవేళ మనకే సాయం అవసరమైతే.. ఎవరిని సాయం అడగాలో ముందే గుర్తించాలి. దాని వల్ల రెస్పాన్సిబులిటీ అనేది ఒకరికి వర్తిస్తుంది. ఎవరైనా అంబులెన్స్‌‌‌‌కు ఫోన్‌‌‌‌ చేయండి అని చెప్పడానికి బదులు నువ్వు అంబులెన్స్‌‌‌‌కు ఫోన్‌‌‌‌ చెయ్యి అని ఒకరికి నేరుగా చెప్పాలి.

ఒకవేళ ఎవరికైనా సాయం అవసరమైతే మనమే యాక్షన్‌‌‌‌లోకి దిగేందుకు సిద్ధం కావాలి. ఎవరో ఒకరు ముందుకొచ్చారంటే జనం కూడా రియాక్ట్‌‌‌‌ అయ్యేందుకు, సాయం చేసేందుకు సిద్ధపడతారు. అందుకే సొసైటీ నీడ్‌‌‌‌ ఏ హీరో అని
అంటూ ఉంటారు. ఒకరు హీరోలా లీడ్‌‌‌‌ తీసుకుంటే మిగతా వాళ్లలో కూడా
కదలిక వస్తుంది.

– డాక్టర్‌‌‌‌ ప్రవీణ్‌‌‌‌ చింతపంటి, సైకియాట్రిస్ట్‌‌‌‌

For More News..

పేపర్ బాటిల్స్‌లో కూల్‌‌డ్రింక్స్‌‌

నర్సరీతో ఆ నలుగురు.. ఉద్యోగాలు పోవడంతో సొంత బిజినెస్

నా వాట్సాప్ చాట్​లను లీక్ చేయొద్దు