వాట్సాప్‌లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు

వాట్సాప్‌లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు

వాట్సాప్ మెసేజ్ పంపుతున్న సమయంలో పొరపాటున ఏదైనా మెసేజ్ డిలీట్ అయిందా? డిలీట్ అయినా మెసేజ్ తిరిగి పొందడం ఎలా? అని ఆలోచిస్తున్నారా? వాట్సాప్ చాట్ లో డిలీట్ అయిన మెసేజ్ లను తిరిగి తిరిగి పొందడానికి రెండు పద్దతులు ఉంటాయి. అవి ఒకటి రీస్టోర్, మరోకటి బ్యాకప్. ఈ రెండిట్లో దేన్ని ఫాలో అయినా మీ చాట్ సేఫ్ గా ఉంటుంది. చాట్ రికవరీ  ఆప్షన్ కోసం గూగుల్ డ్రైవ్, వాట్సాప్ చాట్ బ్యా్క్అప్ కోసం జీమెయిల్ లింక్ చేయాల్సి ఉంటుంది. ఈ బ్యాకప్ గూగుల్ మెయిల్ ఐడీకి లింక్ చేసుకుంటే.. పొరపాటున చాట్ డిలీట్ అయినా రీ స్టోర్ ఆప్షన్ లో పొందొచ్చు. అది ఏలాగో ఇప్పుడు చూద్ధాం... 

step 1: వాట్సాప్ మెయిన్ స్క్రీన్‌లో టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న త్రీ డాట్స్‌ ఐకాన్‌పై క్లిక్ చేయాలి.

step 2: సెట్టింగ్స్‌పై నొక్కి చాట్స్‌> చాట్ బ్యాకప్ > బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్‌ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి.

step 3: “నెవర్” కాకుండా బ్యాకప్ టైమ్ ఫ్రీక్వెన్సీని సెలెక్ట్ చేసుకోవాలి.

step 4: ఇప్పుడు చాట్ హిస్టరీని బ్యాకప్ చేయాలనుకుంటున్న గూగుల్ అకౌంట్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.

step 5: గూగుల్ అకౌంట్ యాడ్ చేయకపోతే “యాడ్ అకౌంట్” పై నొక్కి, మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయాలి.

step 6: బ్యాకప్‌ల కోసం వైఫై లేదా మొబైల్ నెట్‌వర్క్‌లో ఒక దానిని ఎంచుకునేందుకు “బ్యాకప్ ఓవర్‌ “పై క్లిక్ చేయాలి. సెల్యులార్ డేటా నెట్‌వర్క్ ద్వారా బ్యాకప్ చేయాలని ఎంచుకుంటే… మీరు చాలా డేటాను కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి వైఫై సెలెక్ట్ చేసుకోవడం బెటర్.
మీరు బ్యాకప్‌ని డైలీ, వీక్లీ లేదా మంత్లీకి సెట్ చేయవచ్చు. ఆటోమేటిక్‌గా కాకుండా మాన్యువల్‌గా బ్యాకప్ చేసుకోవాలంటే ఓన్లీ వెన్ ఐ ట్యాప్ బ్యాకప్ అనే ఆప్షన్ ఎంచుకోవచ్చు. అయితే ప్రతిసారీ మాన్యువల్‌గా బ్యాకప్ చేసుకోవడం కాస్త ఇబ్బంది కాబట్టి ఆటోమేటిక్‌గా బ్యాకప్ అయ్యేలా సెట్ చేసుకుంటే మంచిది.
 

 రీస్టోర్: 

 ఇది యాప్ ఇన్ స్టాల్ చేసేటప్పుడే ఆక్సిస్ అడుగుతుంది. ఆ నెంబర్ పై ఆల్ రెడీ వాట్సాప్ అకౌంట్ ఉండి పాత డేటా మీకు కావాలనుకుంటే ఈ ఆప్షన్ బెటర్. వాట్సాప్ లో లాగిన్ అయ్యే ముందు రీస్టోర్ ఆప్షన్ అడుతుతుంది.