మీ మొబైల్ నుంచి డబ్బులు మాయం అయ్యాయా?..ఇలా కంప్లయింట్ చేయండి

మీ మొబైల్ నుంచి డబ్బులు మాయం అయ్యాయా?..ఇలా కంప్లయింట్ చేయండి

ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు, స్కామ్లు బాగా పెరిగిపోయాయి. లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించుకుంటున్న ఆన్లైన్ ఫ్రాడ్ స్టర్లు..ప్రజల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈ సమస్య తీవ్ర తరం కావడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు అనేక సెక్యూరిటీ యాక్టివిటీస్ అమలు చేస్తోంది. ఆన్లైన్ మోసగాళ్ల చేతిలో సాధారణ ప్రజలు మోస పోకుండా ఎప్పటికప్పుడూ మార్గదర్శకాలు, నిబంధనలను అమలు చేస్తోంది ఆర్బీఐ. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. ఫోన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు లేదా ఆన్ లైన్ పేమెంట్ గేట్ వే సమస్యలతో మీరు మోసానికి గురైతే ఫిర్యాదు చేయవచ్చు. అలాటే మీ ఖాతానుంచి డబ్బు విత్ డ్రా చేయబడితే కోల్పోయిన నగదును తిరిగి ఇవ్వబడుతుంది. 

మీరు ఆన్ లైన్ మోసానికి గురైన మూడు రోజుల్లో సంబంధిత బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి. ఇలా చేస్తే మీ డబ్బు రికవరీ చేయబడతాయి. 4 నుంచి 7 రోజుల్లో బ్యాంకుకు సమాచారం ఇచ్చినా రికవరీ ఛాన్స్ ఉంటుంది.  

సమాచారం ఎలా ఇవ్వాలి 

  • ఆన్ లైన్ మోసానికి గురైనట్లు గుర్తించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లో వ్రాత పూర్వకంగా కంప్లైంట్ చేయాలి. 
  • బ్యాంకును సందర్శించి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు కాపీని సమర్పించి మోసం జరిగినట్లు సమాచారం ఇవ్వాలి. 
  • ఈ రెండు డాక్యుమెంట్ల సాఫ్ట్ కాపీలను RBI ఈ మెయిల్ ID ; crpc@rbi.in కి పంపాలి 
  • అలాగే సీసీలో మీ బ్యాంక్ ఈమెయిల్ ఐడీ కూడా చేర్చాలి. 
  • ఇదంతా మోసం జరిగిన మూడు రోజుల్లో పూర్తి చేయాలి .

ఎవరు ఫండ్ రికవరీ పొందలేరంటే.. 

బిట్ కాయిన్, ఆన్లైన్ కరెన్సీ , ఆన్ లైన్ గేమ్ లు లేదా బెట్టింగ్ లో పోగొట్టుకున్న డబ్బు సాధారణంగా తిరిగి  రీఫండ్ కాదు. ఒకవేళ లావాదేవీలు ఉద్దేశ్వపూర్వకంగా జరిగినా.. బ్యాంకుకు సమాచారం అందించిన తర్వాత నిర్లక్ష్యం వహించినా రీఫండ్ కావడం కష్టతరం అవుతుంది.