బాడీలో ఎక్కువగా ఎండకి ఎక్స్ ఫోజ్ అయ్యేవి ముఖం, చేతులు. అయితే ఎండ నుంచి ప్రొటెక్షన్ కోసం ముఖానికి చాలా క్రీములు రాస్తుంటారు. మరి చేతుల మాటేంటి? ఎండ, దుమ్ము, ధూళి వల్ల నల్లబడ్డ చేతుల్ని మళ్లీ మెరిపించడానికే ఈ టిప్స్.
* చేతులపై నలుపు పోవాలంటే నిమ్మకాయ బెస్ట్ ఆప్షన్. నిమ్మరసాన్ని చేతులకి పట్టించి కాసేపు మసాజ్ చేయాలి. పావుగంట తర్వాత నీళ్లతో కడగాలి. ఇలా తరచూ చేస్తే నిమ్మరసం నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేసి ఎండ వల్ల నల్లబడ్డ చేతుల్ని మెరిపిస్తుంది. దీనిలోని బ్రైటనింగ్ ఏజెంట్స్ చేతుల నలుపుని వెంటనే పోగొడతాయి.
* చేతులు, మోచేతుల నలుపుకి పెరుగు కూడా మంచి సొల్యూషన్. ఒక టీ స్పూన్ పెరుగుని చేతులపై రాసి మసాజ్ చేస్తే చర్మం తెల్లబడుతుంది.
* కీరదోస రసాన్ని చేతులకి రాసి, పావుగంట తర్వాత చన్నీళ్లతో కడగాలి. ఇలా నెలపాటు చేస్తే కీరదోసలోని నేచురల్ ఆస్ట్రిజెంట్స్ స్కిన్ని తెల్లగా మారుస్తాయి. అలాగే విటమిన్-ఎ మెలనిన్ ఉత్పత్తిని తగ్గించి చేతుల్ని అందంగా మారుస్తుంది.
* ఆరెంజ్ లోని విటమిన్-సి బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసి హైపర్ పిగ్మెంటేషన్ నుంచి చర్మాన్ని కాపాడుతుంది. అందుకే ఆరెంజ్ జ్యూస్ని చేతులపై నలుపున్న చోట రాసి మసాజ్ చేయాలి. పావుగంట తర్వాత కడిగితే మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే టొమాటోలోని లైకోపిన్, యాంటీ ఆక్సి డెంట్స్.. సన్ డ్యామేజ్ నుంచి చేతుల్ని కాపాడతాయి.