ప్రజెంట్ జనరేషన్ లో స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ ట్రూకాలర్స్ వాడడం అలవాటుగా మారిపోయింది. దీని వల్ల తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చినపుడు ఆ కాల్ ఎవరు చేస్తు్న్నారో ఈజీగా గుర్తించొచ్చు. అంతే కాదు నంబర్ సాయంతో సెర్చ్ చేసినా అది ఎవరి నెంబరో తెలుసుకునే వెసులుబాటు ఉంది. దీని వల్ల స్పామ్ కాల్స్ ను ట్రాక్ చేయొచ్చు. అయితే దీని వల్ల కొన్ని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇలా నెంబర్ ట్రూ కాలర్ లో సేవ్ కావడం వల్ల తమ గోప్యతకు భంగం కలుగుతుందని ఇబ్బంది పడే వారూ ఉన్నారు. అలాంటి వారు వారి ఖాతాలోని డేటాను ఎలా తీసివేయాలి. ప్రైవసీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- మీ ఫోన్ లో TrueCaller యాప్‌ని ఓపెన్ చేయండి
- ఎడమ వైపు కార్నర్ సైడ్ లో నిలువుగా ఉన్న3 డాట్స్ ను టచ్ చేయండి
- సెట్టింగ్స్ క్లిక్ చేయండి
- 'Privacy centre' అనే ఆప్షన్ ను ఎంచుకోండి
- ఓపెన్ అయిన లిస్ట్ లో కింది భాగాన ఉన్న 'Deactivate' పై క్లిక్ చేయండి
- ఇలా చేయగానే నోటిఫికేషన్ లో మీ అకౌంట్ డియాక్టివేట్ చేయాలనుకుంటున్నారా.. అని అడుగుతుంది
- 'Yes'అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి.
ఇలా చేస్తే ట్రూ కాలర్ అకౌంట్ లాగౌట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు చేయాల్సిందల్లా మీ ట్రూకాలర్ ఖాతాకు లింకైన మీ నంబర్‌ను తీసివేయడమే. అందుకోసం ఇలా చేయండి.
- అధికారిక వెబ్‌సైట్ Trucaller.comని సందర్శించండి
- ఆ తర్వాత Truecaller 'unlit phone number' పేజీకి వెళ్లండి.
- సరైన దేశం కోడ్‌తో మీ ఫోన్ నంబర్‌ను నమోదు చేయండి. (ఉదాహరణకు +917771114040).
- 'నేను రోబోట్ కాదు' అని ధృవీకరించండి.
మీరు అన్‌లిస్ట్ ఎందుకు చేస్తున్నారో కారణాలను అక్కడున్న ఆప్షన్ లతో టిక్ చేయొచ్చు. లేదంటే లేదంటే మీరే మీ కారణాలను టైప్ చేయవచ్చు. కారణాన్ని రాసిన తర్వాత, ధృవీకరణ క్యాప్చాను నమోదు చేసి, 'అన్‌లిస్ట్' అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇది చేసిన తర్వాత డేటాబేస్ నుంచి నంబర్‌ను తీసివేయడానికి యాప్ 24 గంటలు తీసుకుంటుంది.