
దాదాపుగా ఏప్రిల్ వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళితే చాలు ఎప్పుడు ఇంటికి వెళదామా ఫ్యాను కిందనో, కూలర్ కిందనో.. ఇంకా రిచ్ అయితే ఏసీకిందనో కూర్చోవాలని ఉంటుంది. వేసవి ప్రారంభంలోనే ఎండలు మాడు పగలగొడుతున్నాయి. ఇలాంటి సమయాల్లో చాలామంది కూలర్లు, ఏసీలు కొనుగోలు చేస్తారు. ఏసీ వదలకుండా ఇంట్లోనే ఉంటుంటారు..ఇలాంటి సమయంలో కరెంట్ బిల్ చూస్తే మోత మోగిపోతుంది. ఎలా? అయితే ఏసీ వాడేవారికి కరెంట్ బిల్ తగ్గించుకునే కొన్ని ఐడియాలున్నాయి. చూద్దాం రండి.
ప్రమాదాలను నివారించాలంటే..
ఏసీని వాడేముందుకు గుర్తుంచుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఇన్స్టాలేషన్.. తప్పుగా ఏసీని ఇన్ స్టాల్ చేస్తే కరెంట్ బిల్లు మోతమోగిపోవడమే కాకుండా లీగల్ యాక్షన్ కు దారితీస్తుందని మర్చిపోవద్దు. ఏసీని ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా నడవాలన్నా, కరెంట్ ఆదా చేయాలన్నా మరో ముఖ్యమైన విషయం వైరింగ్.. మీ ఇంటి వైరింగ్ హైఓల్టేజీ వైరింగ్ తో ఉండాలి. సరియైన వైరింగ్ లేకపోతేఅవి ఓవర్ హీటింగ్ ద్వారా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలుంటాయి. తద్వారా ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. ఏసీ ఇన్ స్టాల్ చేసే ముందు మీ ఇంటిలో పవర్ ఫుల్ హైఓల్టేజీ వైరింగ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. కనీసం 2KW విద్యుత్ కనెక్షన్ ఉండాలి.
గదికి సరిపోయే ACని ఎంచుకోవాలి..
ఏసీ కొనుగోలు చేసేముందుకు మీ గది సైజును లెక్కించాలి. ఇన్‌స్టాలేషన్ కోసం మీకు బాల్కనీ లేదా సరైన వెంటిలేషన్ ఉందని నిర్ధారించుకోవాలి. చిన్న రూములకు 1Ton AC సరిగ్గా సరిపోతుంది.1.5 నుంచి2Ton ACలు పెద్ద హాలుకు పర్ఫెక్ట్గా ఉంటుంది. మీ గదిలో విడో ఏసీ స్థలం లేకుండా స్ప్లిట్ ఏసీ బెస్ట్ ఎంపిక.
కరెంట్ ఆదా చేయాలంటే..
AC ని ఎంచుకునేటప్పుడు బడ్జెట్ కీలకమైన అంశం.మీరు విద్యుత్ బిల్లులను ఆదా చేయాలనుకుంటే తక్కువ కరెంట్ ను వినియోగించే 5-స్టార్ రేటింగ్ ఉన్న ACలు కొనుగోలు చేయాలి. మీరు తక్కువ బడ్జెట్‌లో ఉంటే తక్కువ రేటింగ్ ఉన్న AC మరింత సరసమైన ఎంపిక కావచ్చు.
రెగ్యులర్ సర్వీసింగ్ మస్ట్..
ఏసీ ఇన్ స్టాలేషన్ మొదటి అడుగు అయితే సర్వీసింగ్ చాలా కీలకం. కంప్రెసర్ ఓవర్‌లోడ్, ఓవర్ హీటింగ్ నివారించడానికి క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాలి.యూనిట్ డ్యామేజీ కాకుండా కాపాడవచ్చు.రిపేర్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తే ఖర్చులు భారీగా పెరగవచ్చు. లేదా ప్రమాదాలు కూడా జరగొచ్చు. కాబట్టి ఏసీ వాడే వారు ఈ సూచనలు పాటించి ఎండాకాలం ఏసీకింద ఎంజాయ్ చేయండి.